‘అ ఆ’ ఓ అమ్మాయి అబ్బాయి మధ్య సాగే కథే. తెరమీదే వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఆ ఇద్దరూ కూడా చాలా బాగా నటించారు. నితిన్.. సమంత ఇద్దరికీ కూడా తమ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమానే ఇది. ఇద్దరూ ‘వన్ ఆఫ్ ద కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్’ అనిపించేలా నటించారు. ఐతే వీళ్లిదరితో పోలిస్తే స్క్రీన్ టైం తక్కువన్నా సరే.. సినిమాలో మరీ కీలకమైన పాత్ర కాకపోయినా సరే.. కనిపించినంత సేపూ అదరగొట్టేశాడు రావు రమేష్. సినిమా అయ్యాక నితిన్.. సమంతల్నయినా మరిచిపోతారేమో కానీ.. రావు రమేష్ ను ఎవ్వరూ మరిచిపోలేరు. అంత బలమైన ముద్ర వేశాడు ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
‘‘మరీ ముఖం కడుక్కోవడానికి మినరల్ వాటర్ అంటే బలుపెక్కువైపోయిందనుకుంటార్రా.. ఆ లేబుల్ తీసేయ్’’ అంటూ రావు రమేష్ పలికే తొలి డైలాగ్ కే థియేటర్లో ఒకటే కేరింతలు. ఇక సినిమా చివర్లో పలికిన డైలాగులకైతే రెస్పాన్స్ మామూలుగా లేదు. సినిమాలో త్రివిక్రమ్ చాలా మంచి మాటలు రాశాడు కానీ.. అందులో రావు రమేష్ కు రాసినవే ది బెస్ట్ అని చెప్పాలి. త్రివిక్రమ్ అభిమానులైతే కేవలం రావు రమేష్ పాత్ర కోసమే సినిమాకు వెళ్లొచ్చు అనిపించేంతగా ఈ పాత్ర ఎంటర్టైన్ చేసింది.
ఈ మధ్యే ‘బ్రహ్మోత్సవం’ సినిమా గురించి జనాలు ఎంత నెగెటివ్ గా మాట్లాడుకున్నా రావు రమేష్ పెర్ఫామెన్స్ మాత్రం అందరి ప్రశంసలూ అందుకుంది. అంతకుముందు ‘ముకుంద’లోనూ అంతే. గత ఏడాది ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లోనూ తనదైన శైలిలో వినోదం పండించాడు రావు రమేష్. ‘రౌడీ ఫెలో’లో కూడా ఆయన పాత్రను అంత సులువుగా మరిచిపోలేం. సినిమా సినిమాకూ తన నటనకు పదును పెట్టుకుంటూ.. తన ప్రత్యేకత చాటుకుంటూ తండ్రి రావుగోపాల్ రావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు రావు రమేష్. సరిగ్గా వాడుకుంటే మన దగ్గరే అద్భుతమైన నటులున్నారనడానికి ఉదాహరణగా నిలుస్తున్నాడతను.