రావు గోపాల్రావు.. ఈ పేరుకు ఓ విలక్షణ, విభిన్న నటనకు మారుపేరు అన్నంతగా గుర్తింపు ఉంది. ఆయన ట్యాలెంట్ కు సరిపోలే నటులు ఇప్పటివరకూ ఇండస్ట్రీలో ఎవరూ లేరన్న మాట అతిశయోక్తి కాదు. ఆయన కొడుకు రావు రమేష్. తండ్రి వారసత్వంతో కాకుండా.. సొంతగా నిరూపించుకుని ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ పెయిడ్ కేరక్టర్ ఆర్టిస్టుగా అవతరించడం వెనక రావు రమేష్ కష్టం చాలా ఉంది.
'మా నాన్న మహానటుడు కావడంతో నాకు తేలిగ్గా అవకాశాలు వస్తాయని అందరూ చెబితే.. నేను కూడా అదే కరెక్ట్ అనుకున్నా. కానీ వాస్తవం మాత్రం అలా జరగలేదు. ఇక్కడ ఛాన్సులు రాక టీవీల్లోకి వెళ్లాను. అక్కడా ఎదురుదెబ్బలే. సినిమాల్లో బ్రేక్ కోసం ఎంతో ఎదురుచూశాక.. గమ్యంలో పాత్రకు గుర్తింపు వచ్చింది. అయితే నాకు అసలు సిసలైన బ్రేక్ మాత్రం.. 'కొత్త బంగారు లోకం సినిమా ద్వారానే వచ్చింది' అంటున్నాడు రావు రమేష్.
'ఆ సినిమాతో సక్సెస్ సాధించాక కెరీర్ గాడిలో పడింది. ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు నాన్న ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోంది. నా విజయం చూసి ఆయన ఎంతో సంతోషించేవారు. నా కెరీర్ విషయంలో పెద్ద లోటు... నాన్న త్వరగా వెళ్లిపోవడమే. ప్రస్తుతం.. అ..ఆ.. చిత్రంలో చేసిన పాత్ర నాకు మరింతగా మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నా.' అన్నాడు గోపాల్రావు గారి అబ్బాయి.