కొందరు దర్శకులకు కొందరు నటుల మీద గురి ఉంటుంది. రావు రమేష్ మీద బాగా గురి ఉన్న దర్శకులు కొందరున్నారు. అందులో ముందు శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పుకోవాలి. ఆయన ప్రతి సినిమాలోనూ రావు రమేష్ కు కీలకమైన పాత్ర పడుతుంది. ఆ పాత్రల్లో రావు రమేష్ చెలరేగిపోతుంటాడు. ఇక శ్రీకాంత్ అడ్డాల తర్వాత రావు రమేష్ ను బాగా ఉపయోగించుకునే దర్శకుడు హరీష్ శంకర్. అతడి తొలి సినిమా ‘షాక్’ తీసే సమయానికి రావు రమేష్ ఇండస్ట్రీలో లేడు. ఆ తర్వాత ‘మిరపకాయ్’ దగ్గర్నుంచి రావును భలేగా వాడుకుంటున్నాడు హరీష్. ఆ చిత్రంలో ప్రిన్సిపాల్ క్యారెక్టర్లో అదరగొట్టాడు రావు.
ఆ తర్వాత గబ్బర్ సింగ్.. రామయ్యా వస్తావయ్యా.. సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాల్లోనూ రావుకు మంచి పాత్రలు పడ్డాయి. అందులోనూ ‘సుబ్రమణ్యం..’లో బియ్యం బుజ్జి పాత్రలో రావు రమేష్ నటనను అంత సులువుగా మరిచిపోలేం. ఇప్పుడు హరీష్ కొత్త సినిమా ‘దువ్వాడ జగన్నాథం’లోనూ రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఇందులో ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అది అని సమాచారం. రావు రమేష్ కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ పాత్రల్లో ఇదొకటని ‘డీజే’ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ అంతా పూర్తయిందని సమాచారం. మరి రావు రమేష్ ఈసారి ఎలా కనిపిస్తాడో చూద్దాం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/