పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ అంటే చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. అందుకోసం బాలీవుడ్ నుంచి.. మిగతా ఇండస్ట్రీల నుంచి విలన్లను పట్టుకొస్తుంటారు దర్శకులు. ఐతే ఈసారి మాత్రం ఆయన ఓ తెలుగు విలన్ తో తలపడబోతున్నాడు. ఆ విలన్ మరెవరో కాదు.. విలక్షణ నటుడు రావు రమేష్. క్యారెక్టర్ రోల్స్ తో పాటు విలన్ పాత్రలూ చేసే రావు రమేష్.. మహేష్ బాబు సినిమాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ‘బ్రహ్మోత్సవం’ల్లో నెగెటివ్ రోల్స్ చేశాడు. కానీ అవి సాఫ్ట్ సినిమాలు. పవన్ సినిమా ‘కాటమరాయుడు’ మాత్రం మాస్ టచ్ ఉన్న సినిమా. అందులో రావు రమేష్ విలన్ పాత్రను ఎలా పండిస్తాడన్నది ఆసక్తికరం.
‘‘కాటమరాయుడులో తన పాత్ర గురించి రావు రమేష్ వివరిస్తూ.. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్ కు మామయ్యగా నటించాను. తాజాగా ఆయన నటిస్తున్న ‘కాటమరాయుడు’ సినిమాలో విలన్ గా కనిపిస్తాను. ప్రేక్షకులకు కిక్ ఇచ్చే క్యారెక్టర్ అది. రాయలసీమ యాసలో నా పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది.కెరీర్ లో నాకు మైలురాయి లాగా ఈ పాత్ర నిలుస్తుంది’’ అని చెప్పాడు.ఇక విలన్ పాత్రల గురించి రావు రమేష్ చెబుతూ కొట్టడం.. అరవడం మాత్రమే ఆ పాత్రల స్వభావాలు కాదని.. అందులో అనేక కోణాలు దాగి ఉంటాయని వివరించాడు. నటనలో ఎప్పుడూ తన తండ్రిని తాను అనుకరించలేదని.. అలా అనుకరించాలని కూడా ఏ రోజూ అనుకోలేదని చెప్పాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/