నాన్న‌గారు ఓ నిఘంటువు: రావు ర‌మేష్

Update: 2018-02-09 10:14 GMT
ప్ర‌స్తుతం టాలీవుడ్ లోని విల‌క్ష‌ణ న‌టుల‌లో రావు ర‌మేష్ ది ఓ ప్ర‌త్యేక శైలి. లెజెండ‌రీ యాక్ట‌ర్ రావుగోపాల‌రావు త‌న‌యుడిగానే కాకుండా త‌నకంటూ ఓ ప్ర‌త్యేక‌మైన ముద్ర‌ను వేసుకున్న న‌టుడు రావు ర‌మేష్. ఈ విల‌క్ష‌ణ న‌టుడు టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అన‌తి కాలంలోనే 100 సినిమాల మార్క్ ను చేరుకున్నారు. అప్ప‌డే 100 సినిమాలు పూర్త‌య్య‌యా అన్నంత వేగంగా సినిమాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.  గురువారం సాయంత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని ద‌ర్శించుకున్న రావు ర‌మేష్ మీడియాతో మాట్లాడుతూ అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. కళామతల్లి సేవలో త‌రించడం త‌న‌ అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

మొన్న మొన్నే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన‌ట్లుంద‌ని - అప్పుడే 100 సినిమాలు దాటిపోయాయ‌ని ర‌మేష్ అన్నారు. 100 సినిమాలలో న‌టించినా...తాను  ఇప్ప‌టికీ నిత్య విద్యార్థిన‌ని స‌విన‌యంగా చెప్పారు. త‌న‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నంత‌కాలం ఇండస్ట్రీలో ఉంటానని తెలిపారు. డ్రీమ్‌ రోల్‌ అంటూ ఏమీ లేదని - విల‌క్ష‌ణ‌మైన‌ పాత్రలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌తాన‌న్నారు. దువ్వాడ జగన్నాధం (డిజె) లో రొయ్య‌ల నాయుడు పాత్ర ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు. ‘ఆ ఒక్కటీ అడక్కు..’లో రావుగోపాల‌రావు పోషించిన పాత్రను అనుక‌రించే ప్రయత్నం చేశానన్నారు. తెలుగు సినీ చరిత్రలో నాన్న రావు గోపాలరావు ఓ చరిత్ర... ఓ నిఘంటువు అని, త‌న‌లాగా  కొన్ని సినిమాల్లో బాగా నటించి ఆడేస్తే...గొప్పోళ్లం కాద‌ని చెప్పారు. సినిమా తెర ఉన్నంత కాలం రావు గోపాలరావు పేరు ఉంటుందని స్పష్టం చేశారు. తాను శ్రీకాకుళంలోనే పుట్టానని - తన తల్లి కుటుంబీకులంతా అరసవల్లిలోనే ఉన్నారని చెప్పారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న త‌న త‌ల్లి కోస‌మే శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నానన్నారు.

Tags:    

Similar News