ఎన్ని రకాల గన్స్ వాడారంటే..

Update: 2016-04-05 05:21 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గన్స్ అంటే చాలా ఇష్టం. చేత్తో తుపాకులు పట్టుకుని చాలా సినిమాల్లోనే నటించాడు. పాటల్లోనూ - ఫైట్స్ లోనూ గన్స్ తో పవన్ చేసే  హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సర్దార్ గబ్బర్ సింగ్ లో కూడా గన్స్ వాడకం ఎక్కువగానే కనిపించనుంది. అసలు ఈ మూవీ కాప్షన్.. గన్స్ - గట్స్ అండ్ లవ్ అని పెట్టారంటే.. తుపాకులతో పవన్ ఆడే ఆట ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ఏకే 47 - .44 మాగ్నమ్స్ - షాట్ గన్స్ - రైఫిల్స్... ఇలా రకరకాల తుపాకులను సర్దార్ కోసం ఉపయోగించారు. ది మేర్స్ లెగ్ అనే ఓ గన్ హాలీవుడ్ మూవీ: డెడ్ ఆర్ అలైవ్ లో ఉపయోగిస్తారు. దీన్ని కూడా సర్దార్ లో చూడచ్చు. 'సర్దార్ లో ప్రత్యేకంగా నిలిచే ఓ గన్.. లెగ్ రైఫిల్. ఇది కాకుండా 12 బేస్ షాట్ అయిన లుపారా అనే ఓ గన్ షాట్ గన్ ను సిలికాన్ మాఫియా ఎక్కువగా ఉపోయోగిస్తుంది. దీన్ని కూడా సర్దార్ లో చూడచ్చు' అంటున్నాయి యూనిట్ వర్గాలు.

వీటిలో చాలా గన్స్ ను పవన్ దగ్గరుండి తయారు చేయించాడు. ఒరిజినల్ కు ఏమాత్రం తీసిపోకుండా ఉండేలా.. గన్ స్మిత్స్ తో వీటిని చేయించారు. వాటి గురించి పవన్ ప్రతీ చిన్న వివరం చెబుతుంటే, వినేవాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యేదట. ఇక వాటి సౌండింగ్ విషయంలో పవన్ స్పెషల్ కేర్ తీసుకున్నాడని చెబుతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ లో ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా 700 గన్స్ వాడారంటే.. ఈ మూవీలో వాటి హంగామా ఏ రేంజ్ లో ఉండనుందో అర్ధమవుతుంది.
Tags:    

Similar News