కుర్ర హీరోయిన్లు సినిమాల్లో గ్లామర్ గా కనిపించడం, అల్లరి చేయడం లాంటి వన్న కామన్. కొంతమంది బయట కూడా అంతే రేంజ్ లో ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. కుర్ర హీరోయిన్ రాశిఖన్నా కూడా ఇదే బాపతు. అమ్మడు షూటింగ్ అయిన దగ్గర నుండి పార్టీల్లో సందడి చేసేస్తుంది. పబ్బులు, డిస్కోథెక్ లు రౌండ్లు కొట్టేస్తుంది. ఆల్మోస్ట్ ప్రతీ రోజూ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుందంటే రాశి ఖన్నా స్పీడ్ అర్ధమవుతుంది.
పార్టీలు ఇవ్వడం, తీస్కోవడం విషయంలో కుర్రోళ్లకు ఏ మాత్రం తీసిపోవడం రాశి ఖన్నా. దాదాపు రాత్రంతా పార్టీల్లోనే గడుపుతోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఈ కుర్రభామ వెర్షన్ కూడా గట్టిగానే ఉంది. 'నాకు నైట్ లైఫ్ అన్నా పార్టీలన్నా మహా ఇష్టం. ఇందులో తప్పేంలేదు. నేను షూటింగ్ కు లేట్ గా వస్తే తప్ప.. నా మీద కంప్లెయింట్ చేసే అవకాశం ఎవ్వరికీ లేదు. రాత్రంతా పార్టీలో మెలకువగా ఉన్నా సరే.. ఉదయాన్నే టైంకి షూటింగ్ వచ్చేయగలను నేను' అంటూ రిటార్ట్ ఇచ్చిందీ బ్యూటీ.
నైట్ లైఫ్ అంటే ఇష్టం అని చెబితే.. మీడియా జనాలు పుకార్లు, రూమర్స్ రాసేస్తారని తెలిసినా.. రాశి ఏ మాత్రం జంకడం లేదు. తను పార్టీల్లో ఎంజాయ్ చేయాలని అనుకోవడం తప్పు కాదని తేల్చేసింది. తేడా కొట్టనంత వరకూ ఏం చేసినా కరెక్టే కదా. ఆ తర్వాతే సమస్యలు మొదలవుతాయ్. ఆ విషయం కూడా తెలుసుకోవాలి మరి.