ముఖానికి నవ్వే అందం. ఆ నవ్వులేని ముఖం చూడటం ఎవరి తరం. అదీ సెలబ్రిటీ వరల్డ్ లో హీరోయిన్లు మూతి బిగించుకుని కూర్చుంటే అస్సలు పట్టించుకోరు. అప్పుడప్పుడు నవ్వాలి. నవ్వు రాకపోతే నవ్వినట్లు నటించాలి. అదీ కుదరకపోతే ఓ ప్లాస్టిక్ ఎక్స్ ప్రెషన్ పడేయాలి. సరిగ్గా రాశీఖన్నా నవ్వుని పరిశీలిస్తే అదే అనుభూతి కల్గుతుంది. వేకువజామునే జిమ్మికెళ్లి వస్తోన్న బ్యూటీ ఇలా కెమెరా కంట పడింది.
అభిమానులు ఫోటోలు తీసుకుంటుంటే ఇలా చేయి అడ్డు పెట్టి వద్దు అనే సంకేతాన్ని పంపించింది. మరి అభిమానుల్ని చూసి నవ్వాలి కదా. అందుకోసం రాశీఖన్నా పెదవులపై చిన్న చిరు నవ్వు ఒలకపోసింది. ఆ నవ్వు మనసులోతుల్లోంచి వచ్చిందా? పెదవులపై నుంచా? అన్నది పక్కనబెడితే ఆ క్యూట్ స్మైల్ ఇప్పుడు చూపరులను ఆకట్టుకుంటోంది.
అమ్మడి సోషల్ మీడియా ఫాలోవర్స్ గుండెల్లో విల్లులా దిగిపోతుంది ఆ నవ్వు. ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండానే ఇంత అందంగా కనిపిస్తుందంటే? ముఖానికి మేకప్ వేస్తే రాశీ అందాన్ని తట్టుకోగలమా? అన్నది యువత ఎమోషన్. స్కిన్ టైట్ బ్లాక్ ప్యాంట్... లైట్ స్కై బ్లూ టైట్ టాప్ లో ధరించిన ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు..ఎమోజీలు పోస్ట్ చేసి అభిమానం చాటుకుంటున్నారు.
ఇక రాశీఖన్నా సినిమాల విషయానికి వస్తే గోపీచంద్ సరసన `పక్కా కమర్శియల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే అక్కినేని వారసుడు నాగచైత్య సరసన `థాంక్యూ ` చిత్రంలో నటిస్తోంది. విక్రమ్. కె. కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. తెలుగు లో ఈ రెండు మినహా కోలీవుడ్ లో ఆరు చిత్రాల్లో నటిస్తుంది.