తొందరగా నేనెవ్వరికీ అభిమానిని కాను. చాలామంది కథానాయకులతో నటించాను కానీ... ఎవ్వరికీ అభిమానిని కాలేదు. కానీ రవితేజతో కలిసి పనిచేశాక మాత్రం ఆయనకి పెద్ద అభిమానిగా మారిపోయా. నటనకంటే ఆయన వ్యక్తిత్వాన్ని చూసి గులామ్ అయిపోయా. -- బెంగాల్ టైగర్ కి ముందు రాశిఖన్నా చెప్పిన మాటలివి. ఇలాంటి మాటలు చాలవా ఓ కథానాయకుడిని ఆకట్టుకోవడానికి! నిజంగా ఈ పొగడ్తలే పనిచేశాయో లేక, బెంగాల్ టైగర్ లో కనిపించిన విధానమే నచ్చిందో ఏంటో తెలియదు కానీ... రవితేజ మాత్రం రాశిఖన్నాకి ఆఫర్ ఇచ్చేశాడు.
బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ దిల్ రాజు సంస్థలోనే సినిమా చేయాల్సింది. కానీ రెమ్యునరేషన్ విషయంలో దిల్ రాజుకీ, రవితేజకీ మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. దీంతో రవితేజ శ్రీరంజిత్ మూవీస్ లో సినిమా చేయాలని ఫిక్సయ్యాడు. చక్రి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఆ సినిమాకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కథానాయికగా రాశిఖన్నానే ఎంపిక చేసుకోవాలని రవితేజ చెప్పడంతో ఆమెనే ఫిక్స్ చేశారట. రంజిత్ మూవీస్ అధినేత దామోదర్ ప్రసాద్ ప్రస్తుతం తన కొత్త చిత్రం కళ్యాణ వైభోగమేని విడుదల చేసే పనుల్లోఉన్నారు. ఒకవేళ ఆ సినిమా లేకపోయుంటే రవితేజ కొత్త చిత్రం ఈపాటికే మొదలైపోయేది. కళ్యాణ వైభోగమే థియేటర్లోకి రావడమే ఆలస్యం, ఆ వెంటనే రవితేజ సినిమా కొబ్బరికాయ కొట్టుకుందని తెలుస్తోంది.