అమ్మాయిల్ని ఘోరంగా హింసించి మానభంగం చేశారన్న వార్త చదివినప్పుడు గుండె పగిలిపోతోంది. అలాంటి వార్తల్ని అస్సలు సహించలేను. నిర్భయ ఘటన జరిగినప్పుడు దాదాపు ఏడ్చేశాను. సాటి మహిళకు ఇలాంటి ఘోరం జరిగిందే అని బాధపడ్డాను. అంతేనా కోపంతో భగభగ మరిగిపోయానని అంటోంది రాశీఖన్నా.
''ఢిల్లీ అమ్మాయిగా ఢిల్లీలో జరుగుతున్న అఘాయిత్యాల్ని తెలుసుకుని ఏం చేయాలో పాల్పోని దుస్థితిలో పడిపోయారని వాపోతోంది అమ్మడు. అయితే ఇలాంటి ఘటనలు కేవలం ఢిల్లీలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. కానీ కొన్ని బయటికి తెలియడం లేదంతే. మహిళలపై గౌరవం పెరిగినప్పుడు, సమాజంలో మార్పు వచ్చినప్పుడు, మగాళ్లలో చిన్న చూపు లేనప్పుడు మాత్రమే పరిస్థితిలో మార్పొస్తుంది. మరీ అంత గాయపరిచేలా అలాంటి దారుణాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి'' అంటూ చెప్పుకొచ్చింది రాశీ.
మరి మీరు ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ''ఏడో తరగతిలో ఉన్నప్పుడు నా క్లాస్‌మేట్‌ని ప్రేమించా. కానీ దానిని ప్రేమ అంటారో ఏం అంటారో కూడా తెలీదు. అయినా నచ్చిన కుర్రాడు దొరికితే ప్రేమించి పెళ్లాడుతా. లేదంటే ఇంట్లో వాళ్లు వెతికిన కుర్రాడినే పెళ్లి చేసుకుంటా'' అంటూ రాశీ తన మనసుని ఆవిష్కరించింది.