ప్రతి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోటీ తీవ్రంగానే ఉంటుంది. కాని ఈసారి ఆ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం మరియు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' చిత్రాలు ఒకే రోజున(జనవరి 12) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ప్రస్తుతానికైతే ఎవరు కూడా తగ్గేలా కనిపించడం లేదు. దీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించిన బలా బలాలను ఫ్యాన్స్ బేరీజు వేసుకుంటూ తమ హీరో సినిమా పై చేయి సాధిస్తుందంటే తమ హీరో సినిమా పై చేయి సాధిస్తుందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
హీరోలు.. దర్శకుల విషయం పక్కన పెడితే ఈ రెండు సినిమాల్లో నటిస్తున్న హీరోయిన్స్ విషయం చూసినట్లయితే అల వైకుంఠపురంకు కాస్త ఎక్కువ బరువు ఉంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈమె 'గీత గోవిందం' చిత్రం తర్వాత ఆ స్థాయి సక్సెస్ ను అందుకోలేక పోయింది. ఈమె ఇటీవల చేసిన డియర్ కామ్రేడ్ చిత్రం కూడా నిరాశ పర్చింది. ప్రస్తుతం ఈమె తెలుగులో ఈ సినిమా మినహా పెద్ద సినిమాలను చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
ఇక 'అల వైకుంఠపురంలో' హీరోయిన్ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్.. మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా దూసుకు పోతుంది. దాదాపుగా మూడు కోట్ల పారితోషికంను ఈ అమ్మడు డిమాండ్ చేస్తుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ స్థాయి క్రేజ్ ఉన్న కారణంగా తప్పకుండా అల వైకుంఠపురంలో సినిమాకు ఈమె ప్లస్ అవుతుందనిపిస్తుంది. పూజా ఈ చిత్రంతో పాటు ప్రభాస్ 'జాన్' చిత్రంలో కూడా నటిస్తున్న విషయం తెల్సిందే.
తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాముఖ్యత తక్కువే ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు మినహాఇస్తే హీరోయిన్ పాత్రను బట్టి సినిమా సక్సెస్ లు ఫ్లాప్ లు ఆదారపడవనే ఎక్కువ మంది అభిప్రాయం. మరి ఈ సంక్రాంతికి పోటీ పడబోతున్న సినిమాల ఫలితాలను రష్మిక.. పూజా హెగ్డేలు ఏమాత్రం ప్రభావితం చేస్తారో చూడాలి.