శ్రీవల్లి అద్దె ఇంటి కష్టాలు.. అద్దె కట్టలేక ఇల్లు మారాం

Update: 2022-11-18 10:34 GMT
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం హీరోయిన్ గా పాన్ ఇండియా స్థాయిలో దూసుకు పోతుంది. ఒక్కో సినిమా కు మూడు నుండి అయిదు కోట్ల పారితోషికంను దక్కించుకుంటుంది. ఆర్థికంగా రష్మిక మందన్నా ఫ్యామిలీ బాగా స్థిరపడ్డారు. వందల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఆ మధ్య ఆదాయపు పన్ను శాఖ వారు కూడా రష్మిక మరియు ఆమె యొక్క తండ్రి ఆఫీస్ ల్లో తనికీలు నిర్వహించారు. ఆ స్థాయిలో ఆదాయాన్ని కలిగి ఉన్న రష్మిక మందన్నా ఒకానొక సమయంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొందట. ముఖ్యంగా చిన్నతనంలో నాన్న ఇంటి అద్దె చెల్లించలేక పదే పదే ఇల్లు మార్చేవారు.

రెండు మూడు నెలలకు ఒక ఇల్లుకి అద్దెకు వెళ్లేవాళ్లం. అద్దె తక్కువ ఉన్న చోట ఉండాలని నాన్న పదే పదే ఇళ్లు మార్పేవారు. హీరోయిన్‌ గా రష్మిక ఎంట్రీ ఇవ్వక ముందే ఆమె తండ్రి మెల్ల మెల్లగా ఆర్థికంగా స్థిరపడ్డాడు. రష్మిక హీరోయిన్ గా మంచి పేరు దక్కించుకున్న తర్వాత కోట్ల రూపాయల వ్యాపారాలను చేస్తున్నారు.

తన చిన్నప్పుడు నాన్న ఒక్క బొమ్మ కొనిచ్చినట్లుగా కూడా గుర్తు లేదు అంటూ రష్మిక మందన్నా చెప్పుకొచ్చింది. అత్యంత బీదరికం నుండి తాను వచ్చినట్లుగా రష్మిక మందన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్‌ అయ్యింది.

హీరోయిన్ గా రష్మిక మందన్నా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి ఇప్పుడు నేషనల్‌ క్రష్ గా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.

పుష్ప 2 సినిమా తో మరోసారి దేశ వ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధం అయ్యింది. హిందీలో వరుసగా సినిమాలను చేస్తున్నప్పటికి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు దక్కడం లేదు. హీరోయిన్‌ గా ప్రస్తుతం సౌత్‌ లోనే ఈమెకు స్టార్ డమ్‌ ఉంది. హిందీలో ఆ స్టార్ డమ్‌ కోసం ప్రయత్నాలు చేస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News