తెలుగు ప్రేక్షకులకు ‘ఛలో’ చిత్రంతో పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ‘గీత గోవిందం’ చిత్రంతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈమెకు కోటికి పైగా పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్దంగా ఉన్నారు. త్వరలో నాగ్ - నానిల మల్టీస్టారర్ ల ‘దేవదాస్’ చిత్రంతో రష్మిక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ చిత్రం మాత్రమే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా ఈమె సైన్ చేసింది. ఇలాంటి సమయంలో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని ఆమె నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబ సభ్యులు చర్చించుకుని పెళ్లిని క్యాన్సిల్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో రష్మికతో బ్రేకప్ విషయమై రక్షిత్ స్పందించాల్సిందిగా సోషల్ మీడియాలో కొందరు కోరుతున్నారు. కన్నడ నటుడు అయిన రక్షిత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఈమద్య పెళ్లి గురించిన కామెంట్స్ ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని రక్షిత్ నిర్ణయించుకున్నాడు.
తాజాగా రక్షిత్ సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతూ ఒక సందేశంను పోస్ట్ చేశాడు. ఇన్నాళ్లు ఆధరించిన వారందరికి కృతజ్ఞతలు అంటూ రక్షిత్ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. రష్మికతో బ్రేకప్ అయిన కారణంగానే రక్షిత్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఉంటే పదే పదే పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే తలెత్తే అవకాశం ఉందని రక్షిత్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని కన్నడ సినీ వర్గాల వారు అంటున్నారు. సినిమా కెరీర్ కోసం రష్మిక నిశ్చితార్థం బ్రేకప్ చేసుకుందంటూ వస్తున్న వార్తలకు మెల్ల మెల్లగా బలం చేకూరుతోంది. ఈ విషయమై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.