'పుకార్లను పట్టించుకోను' అంటున్న సూపర్ స్టార్ హీరోయిన్

Update: 2020-07-23 08:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఛలో మూవీతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు మనసు దోచుకుంది యంగ్ హీరోయిన్ రష్మిక మందన. ఈ కన్నడ భామ క్యూట్ నెస్, చిలిపితనంతో యువతను తన వలలో వేసుకుంది. ప్రస్తుతం అమ్మడు వరుస విజయాలతో టాలీవుడ్ స్టార్డం ఎంజాయ్ చేస్తూ డిమాండ్స్ పెంచేస్తుంది. ఈ ఏడాది ఈ భామ మహేష్ కు జోడిగా సరిలేరు నీకెవ్వరు, నితిన్ జోడిగా భీష్మ సినిమాలతో భారీ విజయాలను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం మహమ్మారి కారణంగా ఇంటికే పరిమితం అయింది రష్మిక. లాక్ డౌన్ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటుందట. ఏ ఇండస్ట్రీ అయినా కెరీర్లో ఎదుగుతున్న హీరోయిన్ పై రూమర్స్ రావడం సహజమే. అయితే ఆ రూమర్స్ వ్యక్తిగత జీవితం వైపు వెళ్తే మాత్రం హీరోయిన్స్ ఫైర్ అవుతారు. ప్రస్తుతం రష్మిక కూడా వ్యక్తిగత వ్యవహారాల రూమర్లతో విసిగిపోయి ఉందట.

మీపై రూమర్లను ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నిస్తే.. రష్మిక స్పందించి.. 'మనిషి అన్నాక వ్యక్తిగత సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అది సెలెబ్రిటీ అయితే అవి వార్తలుగా మారుతాయి. వాటిని బేస్ చేసుకుని అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. అలాంటి పుకార్లని అసలు పట్టించుకోను. ఎందుకంటే నాకు అంత తీరిక లేదు" అంటోంది. ఇక లాక్ డౌన్లో అమ్మడు తన మంచి మనసు చాటుకుంటుందట. రష్మిక, ఆమె తండ్రి సిబ్బందికి.. అంటే దాదాపు ఇరవై మందికి నాలుగు నెలలుగా జీతాలు అందిస్తుందట. దీని పై రష్మిక మాట్లాడుతూ.. మేమంటే ఉండగలం. కానీ మా స్టాఫ్ పనిలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే వర్క్ స్టార్ట్ అయ్యేవరకు వాళ్ళకి ఆర్థిక సాయం అందిస్తాం" అని చెప్తోంది. నెటిజన్లు ప్రస్తుతం ఈ విషయం పై రష్మికను తెగ అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మడి చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ జోడిగా పుష్ప, అలాగే తమిళ కార్తీ సరసన ఓ మూవీ ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News