* సినిమాల్లోనే కాదు ఎక్కడైనా మనకొచ్చే విజయాలే మాట్లాడతాయి - ఇప్పటివరకు మీకు వచ్చిన విజయాలు మీలో ఎలాంటి మార్పులు తెచ్చాయి..
మనకొచ్చే సక్సెస్ అదే నా కొచ్చిన సక్సెస్ నాకు కెరీర్ పరంగా ఉపయోగపడింది తప్పిస్తే వ్యక్తిగతంగా నాకు ఏ విధంగా ఉపయోగపడలాడే - నిజానికి నా కెరీర్ కారణంగా వచ్చిన విజయాల్ని నేను అంతగా తలకెక్కించుకోను - ఇవాళ నాకు ఇలా వచ్చిన సక్సెస్ రేపొద్దున ఫెయిల్యూర్ గా అలా నా చేతూల్లోంచి జారిపోకుండా ఉండటానికి మాత్రమే నేను ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో భాగంగా నా వ్యక్తిత్వంలో కానీ లేక వృత్తి పరంగా ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది. వాటినే మనవాళ్లు యాటిట్యూడ్ - పొగరు ఇలా చాలా పేర్లే పెడుతూ ఉంటారు. ఆ కామెంట్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఉంటే ముందకెళ్లలేమ్..
* తెలుగు ఇండస్ట్రీలో ఛలో నుంచి మొదలై సరిలేరు నీకెవ్వరు వరకు చాలా స్పీడ్ గా సాగుతోంది కెరీర్ - మరి నెక్ట్స్ ఏంటి అనే ఆలోచన ఎప్పుడైనా చేశారా..
హీరోయిన్స్ కెరీర్ స్పాన్ చాలా తక్కువ - అయిదేళ్లు కంటే ఇప్పుడు లైమ్ లైట్ ఉండటం దాదాపు అసాధ్యం - ఈ లోపునే వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూనే - నచ్చిన కథల్ని ఎంచుకుంటూ ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాను. మీరు అడిగినట్లుగా నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన ఇప్పటి వరకు రాలేదు. వస్తుందేమో చూడాలి..(నవ్వుతూ)
* కొన్నాళ్లు క్రితం వరుస పెట్టి కన్నడ సినిమాలు - ఇప్పుడు వరుసపెట్టి తెలుగు సినిమాలు - ఇక తెలుగులో ఫిక్స్ అయినట్లేనా మళ్లీ కన్నడలోకి వెళ్లే అవకాశం ఉందా..
కన్నడ నా మాతృభాష - నిజానికి ఇక్కడ నేను ఇలా నాలుగు సినిమాలు చేస్తూన్నా అంటే - తొలిసారిగా నన్ను ఆధారించిన కన్నడ అభిమానులకే థ్యాంక్స్ చెప్పాలి. అదే మాదిరిగా తెలుగు అభిమానులు సైతం నన్ను ప్రోత్సహించారు. నిజానికి తెలుగులో వరుస అవకాశాలు రావడం మధ్యలో కన్నడ ఆఫర్స్ వచ్చినప్పటికీ తెలుగులో అప్పటికే డేట్స్ ఇచ్చేయడంతో కొన్ని మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. కచ్ఛితంగా గ్యాప్ దొరికితే కన్నడ సినిమాల్లో నటించేందుకు నేను ఎప్పుడూ రెఢీనే - రీసెంట్ గా తమిళంలోకి కూడా అడుగుపెట్టాను - కార్తీతో కలిసి నటిస్తున్నా.
* అయితే తెలుగు - తమిళ - కన్నడ భాషల్లోకి అడుగుపెట్టేశారు - ప్యాన్ ఇండియా హీరోయిన్ ట్యాగ్ కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా..
(నవ్వుతూ) ప్యాన్ ఇండియా హీరోయిన్ అని పిలిపించుకోవాలని ఎవర్వకి ఉండదూ చెప్పండి - ఏమో ప్రస్తుతానికి నాకు వచ్చిన ఆఫర్స్ ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటూ - ప్రేక్షకుల్ని అలరించడమే - మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు..
* గీతా గోవిందం కి వచ్చిన సక్సెస్ లో మీకు సింహాభాగం ఉంది - కానీ క్రెడిట్ మొత్తం హీరోకి వెళ్లిపోయిందని ఎప్పుడైనా అనిపించిందా..
(కొంత సైలెన్స్) ఇప్పటి వరకు అనిపించలేదు మీరు అంటుంటే అనిపిస్తోంది. గీత గోవిందం సక్సెస్ క్రెడిట్ మొత్తం విజయ్ దేవరకొండ లాగేసుకున్నాడు - ఇదేగా నా నుంచి మీరు ఎక్స్ పెక్ట్ చేసే ఆన్సర్ - ఇదేగా ఈ ఇంటర్వ్యూ హెడ్ లైన్ (నవ్వులు). సక్సెస్ - క్రెడిట్ ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను - నిజానికి గీతాగోవిందం సక్సెస్ క్రెడిట్ మొత్తం మా టీమ్ మొత్తానికి చెందుతుంది. అది అలానే ఉండనివ్వండి(నవ్వులు)
* తెలుగులో మీ రెండో సినిమాతోనే వంద కోట్లు కలెక్షన్స్ క్లబ్ లో చేరిపోయారు - డియర్ కామ్రేడ్ తో మరోసారి ఆ రికార్డ్ బ్రేక్ చేస్తారా
ఫ్యాన్స్ అనుకుంటే అయిపోతుంది, కానీ వాళ్లకి ముందు డియర్ కామ్రేడ్ నచ్చాలి - గీతా గోవిందం మాదిరిగానే అన్ని కలిసి రావాలి. గీతా గోవిందంకి ఎంత కష్టపడ్డానో డియర్ క్రామేడ్ విషయంలో దానికి మించి కష్ట పడ్డాను. క్రికెట్ కోచింగ్ దగ్గర నుంచి షూట్స్ - ఇప్పుడు ప్రమోషన్స్ వరకు ప్రతి విషయంలో నా కష్టం ఉంది. నాతో పాటు టీమ్ కూడా అంతే కష్టపడ్డారు. చూడాలి ఏం జరుగుతుందో.
* మీతోటి నటీమణులు - మీ సినియర్స్ ఇలా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు గ్లామర్ డాల్స్ అనే ముద్ర వేయించుకోవడానికి ట్రై చేస్తుంటారు - మీరు దానికి విరుద్ధంగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఎందుకలా..
గ్లామర్ పండించటానికి అంత మంది పోటిపడుతున్నారు.. నటన - ఛాలెజింగ్ రోల్స్ వేయడానికి తక్కువ పోటీ ఉంది అందుకే ఈ దారిలో వెళ్తున్నా(నవ్వులు).. స్కిన్ షో చేయడమే గ్లామర్ కాదని నా ఉద్దేశం - చూడటానికి అందంగా కనిపిస్తూ మన నటనతో ఆభిమానుల్ని ఆకట్టుకోవడం కూడా గ్లామరే అని నేను బలంగా నమ్ముతాను - ఇలా ఉంటే కాస్త తక్కువుగా ఆఫర్స్ రావచ్చు ఏం పర్లేదు - ఉన్నవాటిలో నచ్చిన వాటినే ఎంచుకొని కెరీర్ లో ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యాను..
* విజయ్ దేవరకొండతో మళ్లీ కలిసి నటించారు - డియర్ కామ్రేడ్ ఆఫర్ కూడా విజయ్ ఇప్పించారట నిజమేనా..
గీతగోవిందంలో మా కెమిస్ట్రీ బాగా కుదిరింది. నిజానికి ఆ సినిమా సెట్స్ లో ఉండగానే విజయ్ డియర్ కామ్రేడ్ కథ గురించి - అందులో నా క్యారెక్టర్ గురించి చెప్పాడు. లేడీ క్రికెటర్ అనగానే నాకు ఇంట్రెస్టింగా అనిపించి ఒప్పుకున్నా. దాదాపు నాలుగు నెలలు క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకున్నా తీరా చూస్తే సినిమాలో మాత్రం నేను క్రికెటర్ గా కనిపించేది పదినిమషాలే - అదే కొంచెం బాధగా ఉంది.
* మీకు వచ్చిన ఆ చిన్న బాధ డియర్ కామ్రెడ్ రిజల్ట్ రూపంలో పోతుందని మా తుపాకీ టీమ్ భావిస్తోంది - బెస్ట్ ఆఫ్ లక్
థ్యాంక్యూ - ఈ ఇంటర్వ్యూ రీడర్స్ అందరూ డియర్ కామ్రేడ్ తప్పకుండా థియేటర్స్ లో చూడండి