అయ్యో రష్మిక ఎంత పని జరిగింది..!

Update: 2023-01-10 07:03 GMT
సౌత్ సినిమాలు తీసే టైం లోనే ఆమెని నేషనల్ క్రష్ అన్నారు. ఇక బాలీవుడ్ ఛాన్స్ లు అందుకుంటున్న టైం లో ఆమె పేరు మారుమ్రోగింది. తీరా అక్కడ సినిమాలు చేస్తున్న టైం లో మాత్రం ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే నేషనల్ క్రష్ అనగానే అందరికి అర్థమయ్యే ఉంటుంది ఆ అమ్మడు ఎవరో కాదు రష్మిక మందన్న. అమ్మడు చేస్తున్న సినిమాలు ఆడియన్స్ ను సూపర్ గా ఎంటర్టైన్ చేస్తున్నాయి. తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రష్మికకు బాలీవుడ్ నుంచి అవకాశాలు మొదలయ్యాయి.

ఎంత సౌత్ స్టార్డం తెచ్చుకున్నా బాలీవుడ్ అంటే కథానాయికలకు ఒక మోజు ఉంటుంది. ఈ క్రమంలో హిందీ సినిమా ఛాన్సులు రాగానే రష్మిక కూడా ఎగిరి గంతేసింది. మొదటి సినిమా అమితాబ్ తో చేసిన గుడ్ బై నిరాశపరచగా త్వరలో మిషన్ మజ్ను సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 1970 ఇండో పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన రష్మిక ఈ సినిమాలో కూడా పాకిస్తాన్ అమ్మాయిగా నటించింది.

సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేస్తారని అనుకోగా డైరెక్ట్ ఓటీటీ కి రిలీజ్ లాక్ చేశారు. రష్మిక బాలీవుడ్ ఆశలపై ఈ రెండు సినిమాలు దాదాపు నీళ్లు చల్లేశాయని చెప్పొచ్చు. బాలీవుడ్ లో తన టాలెంట్ తో అదరగొట్టేద్దామని అనుకున్న రష్మికకు మొదటి రెండు సినిమాలే పెద్ద షాక్ ఇచ్చాయి. మరోపక్క తెలుగు, తమిళ భాషల్లో కూడా పెద్దగా అవకాశాలు లేవు.

వారసుడు తర్వాత తమిళంలో.. పుష్ప 2 తర్వాత తెలుగులో రష్మిక మరో సినిమాకు సైన్ చేయలేదు. మరి అమ్మడు కేవలం బాలీవుడ్ సినిమాలనే చేయాలని అనుకుంటుందా అలా చేస్తే ఇదివరకు సౌత్ స్టార్ హీరోయిన్స్ చేసిన తప్పునే తను కూడా చేస్తుందని చెప్పొచ్చు.

అంతకుముందు కూడా సౌత్ లో వచ్చిన స్టార్డం తో బాలీవుడ్ వెళ్లి సౌత్ సినిమాలను చిన్న చూపు చూసిన కొందరు హీరోయిన్స్ అక్కడ క్లిక్ అవక ఇక్కడ ఛాన్స్ లు రాక కెరీర్ అటకెక్కేలా చేసుకున్నారు. రష్మిక అలాంటి తప్పు చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పొచ్చు.

పుష్ప 2 మళ్లీ హిట్ కొడితే రష్మికకు మళ్లీ నార్త్ లో ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం తెలుగులో మాత్రం రష్మిక ఏ సినిమాకు సైన్ చేయలేదు. మరి అమ్మడి నెక్స్ట్ ప్లాన్ ఏంటన్నది తెలియాల్సి ఉంది.  



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News