ఎన్టీఆర్‌30 : సీతారామం ఇద్దరు బ్యూటీస్‌ సస్పెన్స్‌

Update: 2022-09-16 13:30 GMT
ఎన్టీఆర్‌ 30 సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ ప్రస్తుతం షూటింగ్‌ కు ఏర్పాట్లు చేస్తున్నాడనే వార్తలు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

స్క్రిప్ట్‌ విషయంలో కాస్త ఎక్కువ సమయం తీసుకున్న కొరటాల శివ వెంటనే షూటింగ్‌ ని మొదలు పెట్టి వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమా విడుదల చేసేలా స్పీడ్‌ గా షూట్‌ ని ముగిస్తాడు అంటూ ఎన్టీఆర్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఇక ఈ సినిమా హీరోయిన్‌ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఆలియా భట్‌.. జాన్వీ కపూర్‌ వంటి బాలీవుడ్‌ ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. కానీ వారిద్దరు కాదని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖంగా రష్మిక మందన్నా మరియు మృణాల్‌ ఠాకూర్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరు అనే విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.

రష్మిక మందన్నా ఇప్పటికే పుష్ప సినిమా తో జాతీయ స్థాయిలో శ్రీవల్లిగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక మృనాల్‌ సీతారామం సినిమాకు ముందే బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చి అక్కడ గుర్తింపు దక్కించుకుంది. ఇక సీతారామం సినిమాతో ఇక్కడ స్టార్‌ గా నిలిచిన విషయం తెల్సిందే. అందుకే మృణాల్‌ ఠాకూర్ ని ఎందుకు తీసుకోకూడదు అంటూ యూనిట్‌ సభ్యుల్లో కొందరు ఉన్నారట.

ఎన్టీఆర్‌ 30 లో సీతారామం సినిమాలో నటించిన ఇద్దరు ముద్దుగుమ్మల్లో ఎవరో ఒకరు కన్ఫర్మ్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్‌ కి జోడీగా మృణాల్‌ అయితే బాగుంటుంది అనే అభిప్రాయంతో కొందరు ఉంటే.. రష్మిక మందన్నా ఒక మంచి ఎంపిక అనే అభిప్రాయం ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్‌ 30 సినిమా యొక్క హీరోయిన్‌ విషయంలో సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. అలాంటిది అప్పుడే హీరోయిన్ గురించి ఇంత హడావుడి ఏంటో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు హీరోయిన్ విషయంలో కొరటాల శివ ఒక క్లారిటీ ఇవ్వాలంటూ ఎన్టీఆర్‌ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News