ఛలో చిత్రంతో టాలీవుడ్ లో తళుక్కున మెరిసింది రష్మిక మందన. మొదటి సినిమాకే యూత్ అంతా రష్మికకు ఫిదా అయిపోయారు. ఆమె చిలిపితనం, క్యూట్ నెస్ యువతకు విపరీతంగా నచ్చేసింది. అందుకు తగ్గట్లుగానే ఛలో, గీత గోవిందం లాంటి వరుస విజయాలు దక్కడంతో రష్మికకు టాలీవుడ్ లో డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల రష్మిక సరిలేరు నీకెవ్వరు, భీష్మ చిత్రాలతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. దీనితో బాక్సాఫీస్ వద్ద రష్మిక విజయ పరంపర కొనసాగుతున్నట్లు కన్పిస్తుంది. ఏ ఇండస్ట్రీలో అయినా కెరీర్ లో ఎదుగుతున్న హీరోయిన్ పై రూమర్స్ రావడం సహజమే. అయితే ఆ రూమర్స్ వ్యక్తిగత జీవితం వైపు వెళ్తే మాత్రం హీరోయిన్స్ ఫైర్ అవుతారు. ప్రస్తుతం రష్మిక కూడా వ్యక్తిగత వ్యవహారాల రూమర్లతో వార్తల్లో నిలిచింది.
తాజాగా రష్మికను.. మీపై వస్తున్న రూమర్స్ ని ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నిస్తే.. రష్మిక ఆసక్తికర సమాధానం ఇచ్చింది. 'మనిషి అన్నాక వ్యక్తిగత సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. అది సెలెబ్రిటీ అయితే అవి వార్తలుగా మారుతాయి. వాటిని బేస్ చేసుకుని అనేక పుకార్లు పుట్టుకొస్తాయి. అలాంటి పుకార్లని అసలు పట్టించుకోను. ఎందుకంటే నాకు అంత తీరిక లేదు. నా షూటింగ్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవడం, డేట్స్ అడ్జెస్ట్ చేయడం వీటితోనే సమయం గడిచిపోతోంది. కొన్ని సార్లు తినడం కూడా మరచిపోతున్నా. కాబట్టి గాలి వార్తలని పట్టించుకునే తీరిక నాకు లేదు. కెరీర్ ఆరంభంలో నాపై వస్తున్న రూమర్స్ చూసి కొంత బాధపడేదాన్ని. ఇప్పుడు అలవాటైపోయింది' అని అమ్మడు చెప్పుకొస్తుంది.