'పుష్ప' గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించిన రష్మిక..!

Update: 2021-02-10 00:30 GMT
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందాన్న‌ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపిస్తుండగా.. రష్మిక ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ క్రమంలో రష్మిక ఓ ఇంటర్వ్యూలో 'పుష్ప' షూటింగ్ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

షూటింగ్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు మొదలయితే సాయంత్రం 7 గంటల వరకు జరిగేదని.. మేకప్ కోసం ఒక రెండు గంటల సమయం పడుతుందని రష్మిక తెలిపింది. అయితే మేము పడిన కష్టమంతా ఆ రోజు షూటింగ్ అయ్యాక ఔట్ ఫుట్ చూసుకుంటే తాము పడ్డ కష్టం వృధా పోలేదన్న నమ్మకం వచ్చేదని తెలిపింది. ఇకపోతే 'పుష్ప' లో రష్మిక కోసం ఆమె కెరీర్ లోనే గుర్తుండిపోయే పాత్రను సుక్కు క్రియేట్ చేసినట్లు సమాచారం. 'రంగస్థలం'లో సమంతకి ఎంత పేరొచ్చిందో.. ఇందులో రష్మిక కు కూడా అలానే  పేరు తెచ్చిపెడుతుందని టాక్ నడుస్తోంది. ట్రైబల్ యువతిగా కనిపించడంతో పాటు చిత్తూరు యాసలో మాట్లాడనుందట.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా వారు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 'పుష్ప' చిత్రాన్ని ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
Tags:    

Similar News