భీష్మ చిత్రం ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో నటించిన హీరో హీరోయిన్ నితిన్.. రష్మిక మందన్నలు చాలా మంచి స్నేహితులుగా మారినట్లున్నారు. నిన్న ప్రీ రిలీజ్ వేడుకలో ఒకరి గురించి ఒకరు మాట్లాడే సమయంలో వీరు ఎంతగా కలిసి పోయారో చెప్పుకోవచ్చు. నితిన్ మాట్లాడుతూ రష్మిక సౌందర్య రహస్యం అంటూ సరదాగా కామెంట్స్ చేయడం ఆమె అందుకు చాలా లైట్ గా తీసుకోవడం జరిగింది. రష్మికపై పంచ్ లు వేసినా కూడా ఆమె ఇబ్బంది పడ్డట్లుగా అనిపించలేదు.
ఇక రష్మిక మాట్లాడిన సమయంలో కూడా నితిన్ గురించి చాలా చెప్పింది. నితిన్ నాకు కో యాక్టర్ అనడం కంటే ఒక మంచి స్నేహితుడు అని చెప్పుకుంటాను. అతడితో టైం చాలా బాగా గడిచింది. సినిమా షూటింగ్ అంతా జాలీగా సాగిందని చెప్పుకొచ్చింది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న నితిన్ కు శుభాకాంక్షలు. అతడి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నితిన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పింది.
ఇదే సమయంలో నేను చాలా మంచి అమ్మాయిని నాలాంటి అమ్మాయిని నువ్వు కనాలి అంది. ఇప్పుడే కాకున్నా మూడు సంవత్సరాల తర్వాత అయినా నాలాంటి అమ్మాయిని మీరు కనండి అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది. రష్మిక కూతురును కనాలంటూ వ్యాఖ్యలు చేసిన సమయంలో నితిన్ సిగ్గుతో తల దించుకుని నవ్వేశాడు. మొత్తానికి ఇద్దరి మద్య స్నేహం చాలా బాగా కుదిరినట్లుగా ఈ వ్యాఖ్యలతో అనిపిస్తుంది.