బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లోనూ తన సత్తా చాటిన నటి రవీనా టాండన్. ఈ మధ్యన విడుదలైన కేజీఎఫ్ 2లో రమికా సేన్ పాత్రను పోషించటంతో పాటు.. ఇప్పటికీ కొన్ని పాత్రలకు ఆమె తప్పించి మరెవరూ సాధ్యం కాదన్నట్లుగా ఉండటం ఆమెకు మాత్రమే సొంతం. యంగ్ ఏజ్ లో హాట్ హీరోయిన్ గా కుర్రకారు మనసుల్ని దోచేసిన ఆమె.. ఇప్పటికే తరగని గ్రేస్ తో వెలిగిపోతుంటారు వెండితెర మీద.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన అక్షయ్ కుమార్ తో లవ్ మ్యారేజ్ తర్వాత వారు విడిపోవటం తెలిసిందే. అక్షయ్ తో విడిపోవాల్సిన పరిస్థేమిటన్న దానిపై ఇప్పటివరకు ఆమె ఓపెన్ కాలేదు. పాతికేళ్ల తర్వాత ఆమె ఆ విషయం గురించి మాట్లాడారు. తాను ఎందుకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. తాజా పరిస్థితి గురించి చెప్పటంతో పాటు.. ఇప్పుడు అక్షయ్ తో తనకున్న రిలేషన్ ఎలాంటిదన్న దానిపైనా ఆమె మాట్లాడారు.
1994లో రిలీజ్ అయిన మోహ్రా మూవీలో తాను.. అక్షయ్ కలిసి పని చేశామని.. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. ఆ సమయంలోనే తామిద్దరం రిలేషన్ లోకి రావటం.. ఆ తర్వాత ఎంగేజ్ మెంట్ జరిగి పెళ్లి చేసుకున్నామని చెప్పారు. ఆ తర్వాత కొద్ది కాలానికే బ్రేకప్ అయ్యిందని.. అతడి లైఫ్ నుంచి తాను బయటకు వచ్చేసినట్లుగా పేర్కొన్నారు.
అక్షయ్ వేరే అమ్మాయితో డేటింగ్ చేయగా.. తాను మరో వ్యక్తితో రిలేషన్ లోకి వచ్చినట్లుగా చెప్పిన రవీనా.. ఇప్పటికి తమ మధ్య ఎలాంటి అసూయలు లేవని.. తామంతా కలుస్తుంటామని.. మాట్లాడుకుంటామని.. ఎవరి లైఫ్ వాళ్లు జీవిస్తూ ముందుకు సాగుతున్నట్లుగా పేర్కొన్నారు.
అయితే.. తన ఎంగేజ్ మెంట్ ఎప్పుడు జరిగిందనే విషయం తనకు సరిగా గుర్తు లేదన్నారు. బ్రేకప్ జరిగిన తర్వాత కొన్నినెలల పాటు తాను పేపర్లు చదవలేదన్న రవీనా.. అక్షయ్ తో ఇప్పుడున్న రిలేషన్ గురించి వివరంగా చెప్పారు.
రవీనాతో పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత ఆయన తన సహ నటి ట్వింకిల్ ఖన్నాను పెళ్లాడగా.. రవీనా వ్యాపారవేత్త అనిల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రద్దైన పాతికేళ్ల తర్వాత నాడు జరిగిన వివరాల్నిమీడియా సమావేశంలో ఓపెన్ అయిన వైనం అందరిని ఆకర్షిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.