నాని సినిమాలో మ‌రో ఇద్ద‌రు హీరోలు

శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను నాని త‌న సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే

Update: 2025-02-13 04:52 GMT

స‌రిపోదా శ‌నివారం సినిమా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న సినిమా హిట్ ది థ‌ర్డ్ కేస్. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను నాని త‌న సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీనిథి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా మే 1 న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు ఇప్ప‌టికే మేకర్స్ అనౌన్స్ చేశారు.

ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ తో బ్రూట‌ల్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే హిట్ ఫ్రాంచైజ్ సిరీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకోగా, ఈ మూడో భాగం ఎప్పుడెప్పుడొస్తుందా అని అంద‌రూ వెయిట్ చేస్తున్నారు. దీంతో ఈ హిట్3ను మ‌రింత గ్రాండ్ గా తెర‌కెక్క‌స్తున్నాడు డైరెక్ట‌ర్ శైలేష్‌.

హిట్3 నుంచి ఇప్ప‌టికే రిలీజైన ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్, పోస్ట‌ర్లకు కూడా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అర్జున్ సర్కార్ గా నాని చాలా బ‌ల‌మైన పోలీస్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు హిట్2 క్లైమాక్స్ లోనే క్లారిటీ ఇచ్చారు. నాని త‌న కెరీర్లోనే మొద‌టిసారిగా పోలీస్ పాత్ర‌లో కనిపించ‌నున్న సినిమా ఇది. శ‌ర‌వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా గురించి ప్ర‌స్తుతం నెట్టింట ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వినిపిస్తోంది.

హిట్3 లో నానితో పాటూ మ‌రో ఇద్ద‌రు హీరోలు కూడా క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తోంది. వారు మ‌రెవ‌రో కాదు. హిట్ ఫ‌స్ట్ కేస్ లో న‌టించిన అడివి శేష్ ఒక‌రు కాగా, హిట్ సెకండ్ కేస్ లో న‌టించిన విశ్వ‌క్ సేన్ మ‌రొక‌రు. ఈ ఇద్ద‌రు యంగ్ హీరోలు హిట్3లో స్పెష‌ల్ క్యామియోలు చేయ‌నున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ విష‌యంతో హిట్3 పై అంచ‌నాలు మ‌రికాస్త పెరిగాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటూ నాని ,శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో ది ప్యారడైజ్ సినిమాను చేస్తున్న విష‌యం తెలిసిందే. సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా క‌థ చాలా కొత్త‌గా ఉంద‌ని ఆల్రెడీ టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే నాని, శ్రీకాంత్ కాంబినేష‌న్‌లో ద‌స‌రా సినిమా వ‌చ్చి ఆ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News