కియారా టాలీవుడ్ లో సెట్ అవ్వాలంటే ఒక్కటే దారా!
రామ్ చరణ్- కియారా అద్వాణీ కాంబినేషన్ ఎందుకనో వర్కౌట్ అవ్వడం లేదు. తొలి ప్రయత్నం `వినయ విధేయ రామ`లో ఇద్దరు జంటగా నటించారు
రామ్ చరణ్- కియారా అద్వాణీ కాంబినేషన్ ఎందుకనో వర్కౌట్ అవ్వడం లేదు. తొలి ప్రయత్నం `వినయ విధేయ రామ`లో ఇద్దరు జంటగా నటించారు. ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇటీవల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం `గేమ్ ఛేంజర్` లోనూ అదే జోడీ కనిపించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నే నమోదైంది. శంకర్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఇది.
అయినా ఆ ప్రభావం ఏ దశలోనూ కనిపించలేదు. దీంతో చరణ్ -కియారా జోడీ అంటే ఇప్పుడో బ్యాడ్ సెంటిమెంట్ గా మారిపోయింది. తదుపరి డైరెక్టర్లు ఎవరూ ఆ కాంబినేషన్ ని సెట్ చేసే ప్రయత్నాల చేయరని పరిశ్రమలో అప్పుడే గుస గుసలు మొదలయ్యాయి. మరి ఈ వరుస వైఫల్యాలు కియారా టాలీవుడ్ కెరీర్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించ బోతున్నాయి? అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
మహేష్ -కియారా కాంబినేషన్ లో రిలీజ్ అయిన `భరత్ అనే నేను` మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కమర్శియల్ గా ఆ సినిమా పెద్ద సక్సెస్ సాధించింది. కానీ మళ్లీ మహేష్ తో కియారాని సెట్ చేసే ప్రయత్నానాన్ని ఏ దర్శకుడు చేయలేదు. తెలుగులో ఇప్పటివరకూ కియారా ఈ మూడు సినిమాల్లోనే నటించింది. ప్రస్తుతానికి కొత్తగా తెలుగు సినిమాలు వేటికి సైన్ చేయలేదు. చేతిలో మాత్రం ఒక కన్నడ చిత్రం... ఓ బాలీవుడ్ చిత్రం ఉన్నాయి. కన్నడలో యశ్ కి జోడీగా టాక్సిక్ లో నటిస్తోంది.
హిందీలో `వార్ 2` లో నటిస్తోంది. ఇందులో అమ్మడు ఎన్టీఆర్ కి జోడీగా నటిస్తుందా? హృతిక్ రోషన్ కి పెయిరా? అన్నది తెలియదు గానీ ఈ రెండు సినిమాలతో అమ్మడు బౌన్స్ బ్యాక్ అవ్వాలి. `టాక్సిక్` విజయం సాధించిన సక్సెస్ క్రెడిట్ ఆమెకు ఎంతవరకూ దక్కుతుంది? అన్నది సస్పెన్స్. అలాగే `వార్ 2` లో హృతిక్ కంటే తారక్ కి జోడీగా నటిస్తే? టాలీవుడ్ లో కలిసొస్తుంది. యంగ్ టైగర్ టాలీవుడ్ క్రేజ్ నేపథ్యంలో? ఆ సినిమాపై ఇక్కడ మంచి బజ్ ఉంది. సక్సెస్ అయితే కియారాకి ఇక్కడ ప్లస్ అవుతుంది. కొత్త అవకాశాలకు లైన్ క్లియర్ అవుతుంది.