రక్తంతో లేఖలు రాశాడు.. బూతు సినిమాలు పంపాడు.. భయంకర అనుభవాన్ని చెప్పిన నటి

Update: 2022-11-07 05:22 GMT
వెండితెర మీద వెలిగిపోయే తారల్ని అమితంగా అభిమానించటం.. అంతకుమించి ఆరాధించేవారికి కొదవ ఉండదు. కానీ.. అలాంటి వారి కారణంగా ఆనందమే కాదు అంతకు మించిన ఆందోళన కొన్నిసార్లు ఎదురవుతుంటుంది. అలాంటి ఉదంతాల గురించి వింటే వణికిపోతాం.

తాజాగా అలాంటి భయానక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు బాలీవుడ్ సీనియర్ నటి.. తెలుగులోనూ పరిమిత సంఖ్యలో సినిమాలు చేసిన రవీనా టాండన్.  ఇప్పుడంటే వయసు మీద పడింది కానీ.. వయసులో ఉన్న వేళలో ఆమె హాట్ అందాలకు యూత్ పిచ్చెక్కిపోయేది.

ఇప్పటికి గ్రేస్ తగ్గని అందం ఆమెది. కేజీఎఫ్ మూవీలోనూ.. వెబ్ సిరీస్ లోనూ నటిస్తూ తన సత్తా చాటుతున్న రవీనా టాండర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాల్ని వెల్లడించారు. తనను అభిమానిస్తున్నానంటూ ఒక అభిమాని చేసిన పనుల గురించి చెప్పిన ఆమె మాటలు వింటే.. తారలకు ఎన్ని ఇబ్బందులో అనుకోకుండా ఉండలేం. ఇంతకూ ఆమెకు ఎదురైన భయానక పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది.

తనను ఒకరు విపరీతంగా అభిమానిస్తామని ఒక అభిమాని నుంచి ఉత్తరాలు వచ్చేవని.. కొన్నిసార్లు అవి రక్తంతో రాసిన లేఖలని చెప్పింది. అతడి తీరు తనకు భయాన్ని కలిగించేదన్నారు. బ్లడ్ వయల్స్.. బూతు సినిమాల్ని కొరియర్ పంపేవాడు.

'ఎంత అభిమానం ఉంటే మాత్రం అలా చేస్తారా? దాన్ని అభిమానం అనాలా? ఇంకేమైనా అనాలా?' అన్న ఆమె..తన భర్త.. పిల్లలతో కలిసి వెళుతుంటే సదరు అభిమాని తన కారు మీద పెద్ద రాయిని విసిరారని చెప్పారు.

అంతేకాదు.. ఆ అభిమాని తన అభిమానాన్ని నిరూపించుకోవటం కోసం ఒకసారి తన ఇంటి గేటు బయట కూడా క్యాంప్ పెట్టారని.. దీంతో తాను పోలీసులకు కంప్లైంట్ చేసినట్లు చెప్పారు. ఇలాంటి భయానక అనుభవాల గురించి విన్నప్పుడు.. తారలకు ఎన్ని కష్టాలో అనుకోకుండా ఉండలేం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News