పందిపిల్లతో రవిబాబు అదిగో..

Update: 2016-06-26 04:31 GMT
విచిత్రకోతితో సాహసబాలుడి విన్యాసాలు చూశాక, సింహం తో మృగరాజు ఫైట్ చేసాక, ఈగ సినిమా విజయం సాధించిన తరువాత, ఎలుకా మజాకా అనే టైటిల్స్ తెలుగు సినిమాలో వినబడుతున్న తరుణంలో తానుకూడా ఒక జంతువుతో సినిమా తీస్తానని రవిబాబు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసినదే. అయితే ఆ జంతువు ఏమిటో అని బయటపెట్టగానే అందరూ నోళ్ళెళ్ళబెట్టారు. ఇంతకీ ఆ జంతువుఏమిటంటే.. ముద్దుముద్దుగా వుండే పందిపిల్లంట..

అవును మీరు విన్నది నిజమే ఒక పందిపిల్ల చుట్టూ తిరిగే కథను ఎంచుకున్నాడట దర్శకుడు. హీరో హీరోయిన్లు మామూలుగానే వున్నా పందిపిల్ల ప్రాధాన్యం ఈ సినిమాకే ఎక్కువని దర్శకుడు తెలుపడం విశేషం. లేని రాక్షసబల్లులని కూడా సృష్టించి సినిమాలు తీస్తున్న ఈరోజుల్లో మన ఎదురుగా ఎప్పుడూ తిరుగుతూ వుండే పందిని ఎందుకు పట్టించుకోరనే చిలిపి ఆలోచనతో మొదలైన ప్రాజెక్టు ఇది.

దీనికి అదిగో అనే వెరైటీ టైటిల్ కూడా పెట్టారు. యానిమ్యాట్రిక్స్ కోసం సొంతంగా ఒక సాఫ్ట్ వేర్ తయారుచేసినట్టు, దానికోసమే 9నెలలు వెచ్చించినట్టు సమాచారం. సినిమా షూటింగ్ మొత్తం రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తునట్టు దర్శకుడు తెలిపాడు.  
Tags:    

Similar News