ప్రూవ్ చేసుకోవాల్సిన సినిమా మొదలైంది

Update: 2018-03-08 06:57 GMT
ఒక ఇంట్లో హీరో హీరోయిన్ ను ఇతర కమెడియన్లు పెట్టేసి.. చక్కగా హౌస్ కామెడీ చేస్తే.. సినిమా హిట్. ఆ ఫార్ములాను కనిపెట్టాడు దర్శకుడు శ్రీను వైట్ల.  కాని అన్నీ అవే తరహాలో తీస్తానంటే ఎలా? అందుకే వరుసగా ఆగడు.. బ్రూస్ లీ.. మిస్టర్.. ఫ్లాపుల మీద ఫ్లాపులు అయ్యాయ్. అలాగే మరోప్రక్కన మాస్ రాజా రవితేజ కూడా.. రెమ్యూనరేషన్ కోసం పట్టుపట్టేసి రొటీన్ కాన్సెప్టులతోనే రావడంతో.. భారీ హిట్టుల మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ ఇద్దరూ ఇప్పుడు మరోసారి కలసి ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్నారు.

అసలు రవితేజ హీరోగా శ్రీను డైరక్టర్ గా.. తొలిసినిమా కలిసే తెరంగేట్రం చేశారు. అదే ''నీకోసం''. ఆ తరువాత ఇద్దరూ వెంకీ.. దుబాయ్ శ్రీను.. వంటి సినిమాలతో అలరించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలసి సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఎప్పటి నుండో వినిపిస్తున్న ఈ సినిమా తాలూకు న్యూస్ ఇప్పుడు నిజమైంది. ఈరోజు ఉదయం ''అమర్ అక్బర్ యాంటోని'' అనే ఈ  సినిమా ముహూర్తం షాట్ కొట్టేశారు. శ్రీను వైట్ల కూతుళ్లు ముఖ్య అతిథులుగా తొలి షాట్ తీసేశారు కూడా. ఇకపోతే ఈ సినిమాలో మనం ఎప్పటినుండో చెబుతున్నట్లు రవితేజ ట్రిపుల్ రోల్ చేయనున్నాడు. అలాగే కమెడియన్ సునీల్ కూడా పూర్తి స్థాయి రోల్ లో అలరించున్నాడు.  

ఏ విధంగా చూసినా కూడా.. ట్రిపుల్ రోల్.. సునీల్.. అమెరికాలో షెడ్యూల్స్.. ఇలా ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా.. ఈ సినిమాతో శ్రీను వైట్ల అండ్ రవితేజ గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇతర హంగులేమో కాని.. కథ మాత్రం గట్టిగా ఉండేలా చూసుకుంటే బెటర్.
Tags:    

Similar News