రవితేజ కెరియర్ ను ఒకసారి పరిశీలన చేస్తే, అంచలంచెలుగా ఆయన ఎలా ఎదుగుతూ వచ్చారనేది సృష్టంగా కనిపిస్తుంది. ఇన్నేళ్ల కెరియర్ లో ఆయన సినిమా గురించి తప్ప మరో విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపించదు. తన సినిమా ఫంక్షన్స్ లో తప్ప మరెక్కడా ఆయన కనిపించరు. అలాగే సినిమాను గురించి తప్ప మరే విష యాన్ని గురించి మాట్లాడినట్టుగా కూడా కనిపించరు. అంతగా ఆయన సినిమానే తన ప్రపంచం అన్నట్టుగా ఉంటారు.
ఏడాదికి మూడు సినిమాలైనా చేయాలనే ఒక ఆలోచనను సాధ్యమైనంతవరకూ ఆచరణలో పెట్టడానికే ఆయన ప్రయత్నిస్తారు. ఆడియన్స్ తన సినిమాల నుంచి ఎలాంటి అంశాలను ఆశిస్తున్నారో వాటి పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకుంటారు.
అలాగే పాత్ర ఏదైనా తన ఎనర్జీ తగ్గకుండా జాగ్రత్త పడతారు. ఆయన ఏ సినిమా కూడా నత్త నడక నడవదు. కథను పరిగెత్తించే విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలకు వెళ్లరు.
ఇక రవితేజలో ఉన్న మరో గొప్పతనం ఏమిటంటే, తన సినిమాల ద్వారా ఆయన కొత్త దర్శకులను చాలామందిని పరిచయం చేస్తుంటారు. ఈ విషయంలో ఆయన ఎంత మాత్రం వెనుకడుగు వేయరు .. కొత్తవాళ్లకి ఛాన్స్ ఇస్తే ఏమవుతుందోనని భయపడరు.
అలాగే ఈ సారి కూడా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో శరత్ మండవకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ 2 నిముషాలు మాత్రమే మాట్లాడారు.
"తమ్ముళ్లూ .. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందా? మీ అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. నాకు మాత్రం చాలా బాగా నచ్చేసింది. శరత్ చాలా మంచి సినిమా తీశాడు .. అందులో నాకు వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు. ఈ సినిమాలో దివ్యాన్ష చాలా అందంగా కనిపిస్తుంది. నా గురించి అనిల్ మాట్లాడాడు .. ఆయన మైక్ తీసుకుంటేనే ఒక ఎనర్జీ వస్తుంది. అలా మాట్లాడటం చాలా కష్టం. చాలామంది తమ్ముళ్లు బయటే ఉండిపోయారు పాపం .. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరం కలుసుకుందాం .. అప్పుడు అందరి గురించి మాట్లాడతాను" అంటూ ముగించారు.