చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటున్న రవితేజను హీరోగా మార్చిన క్రెడిట్ మాత్రం శ్రీనువైట్లదే. ‘నీకోసం’ సినిమాతో రవితేజలోని హీరో - శ్రీనువైట్లలోనీ దర్శకుడూ తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ‘వెంకీ’ - ‘దుబాయ్ శ్రీను’ వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్ లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రవితేజ మొదటిసారిగా త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్‌కి ‘నేలటికెట్’ అడ్డుపడుతోందట. అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోబోతున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం నిలవబోతుందని సినిమా ప్రారంభానికి ముందే చెప్పాడు శ్రీనువైట్ల. అంటే యూనిట్ మొత్తం కలిసి, అమెరికాకు బయలుదేరనున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి, కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాలనుకున్నారు చిత్ర యూనిట్. అయితే రవితేజ, కల్యాణకృష్ణ దర్శకత్వంలో చేస్తున్న ‘నేలటికెట్’ చిత్ర షూటింగ్ మొత్తం పూర్తిచేసిన తర్వాతే శ్రీను సినిమాకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడట.
ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న నేలటికెట్ లో మరో మూడు పాటల చిత్రీకరించాల్సి ఉందట. ఆ పాటల చిత్రీకరణ ముగిసిన తర్వాత శ్రీను సినిమా కోసం అమెరికా వెళ్లనున్నాడు రవితేజ. యూనిట్ మొత్తానికి వీసా కార్యక్రమాలు ముగించే పనిలో ఉన్నారు శ్రీనువైట్ల అండ్ కో. ఏప్రిల్‌లో శ్రీను, రవి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మానుయల్ హీరోయిన్గా ఎంపికైంది.