మాస్ మహారాజా రవితేజ ఫేవరెట్ ప్లేస్ ఏదో తెలుసా? ఆయన సినిమా షూటింగులకు వెళ్లాలన్నా.. ఫ్యామిలీ వెకేషన్ ప్లాన్ చేయాలన్నా ఏ లొకేషన్ ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా అంటే.. ఇదిగో ఆయనే సమాధానమిచ్చారు.
లేటెస్టుగా ఓ త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసిన రవితేజ .. న్యూయార్స్ సిటీ తన ఫేవరెట్ ప్లేస్ అని తెలిపారు. చాలా ఫేవరెట్ ప్లేస్ లు ఉన్నా ఇది చాలా ప్రత్యేకమైనది అని వెల్లడించారు. ఇంతకుముందు రవితేజ నటించిన చాలా సినిమాలు న్యూయార్క్ అమెరికా బ్యాక్ డ్రాప్ ఉన్నవే. కనీసం ఒకట్రెండు పాటల్ని అయినా ఇక్కడ ప్లాన్ చేస్తుంటారు ఆయన దర్శకులు.
అన్నట్టు చైనా నుంచి దిగుమతి అయిన కరోనా వైరస్ తొలిగా న్యూయార్క్ సిటీపైనే తీవ్రంగా దాడి చేసింది. ఈ నగరంలో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. రద్దీగా ఉండే ఖరీదైన నగరంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఈ ఒక్క సిటీలో 6.5 లక్షల మంది కరోనా భారిన పడితే సుమారు 35వేల మంది చనిపోయారు.
ఇక రవితేజ నటించిన క్రాక్ మూవీ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయిక. దీంతో పాటు వరుసగా పలు స్క్రిప్టుల్ని రవితేజ లాక్ చేశారని తెలుస్తోంది.