మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ సంక్రాంతి బరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తుండగానే బ్యాక్ టు బ్యాక్ కాన్సెప్టుల్ని ఫైనల్ చేసి చకచకా సెట్స్ పైకి వెళ్లాలన్నది రాజా ప్లాన్. ప్రస్తుతం ఖిలాడి పేరుతో అవుట్-అండ్-అవుట్ ఎంటర్ టైనర్ కోసం రవితేజ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ మహారాజ్ ద్విపాత్రాభినయం చేయనున్నారు.
నూతన సంవత్సర కానుకగా ఖిలాడీ చిత్ర బృందం విడుదల చేసిన తాజా పోస్టర్ తమిళ స్టార్ విజయ్ నటించిన 2016 బ్లాక్ బస్టర్ - థెరీ (తెలుగులో పోలీసోడు)తో పోలి ఉండడంతో ఇది రీమేక్ అన్న ఊహాగానాలకు దారితీసింది.
మాస్ మహారాజాతో ఈ రీమేక్ గురించి గత ఏడాది వరకు కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో చర్చలు జరిపిన విషయం అందరికీ తెలిసిందే. కానీ రకరకాల కారణాలతో ఈ ప్రాజెక్ట్ ఎన్నడూ కార్యరూపం దాల్చలేదు. రవితేజ - సంతోష్ శ్రీనివాస్ ఇద్దరూ తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కానీ టీం ఖిలాడి నుండి వచ్చిన తాజా పోస్టర్ తేరి రీమేక్ పుకార్లను తిరిగి తెరపైకి తెచ్చింది. అయితే ఇది నిజమేనా? అన్నదానికి దర్శకనిర్మాతల నుంచి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సి ఉంటుంది.
దళపతి విజయ్ సరసన `తేరీ`లో సమంత- అమీ జాక్సన్ కథానాయికలుగా నటించారు. `ఖిలాడి`కి యువ నాయికలు మీనాక్షి చౌదరి - డింపుల్ హయాతి నాయికలు. కె.ఎల్ యూనివర్శిటీ అధినేత కోనేరు సత్యనారాయణ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.