ఒక్క పరాజయం బోలెడన్ని నేర్పిస్తుంది. కిక్ 2 పరాజయం రవితేజను చాలానే మార్చేసింది. అతడు ఎప్పటిలా రొటీన్ గా కనిపించాలని అనుకోవడం లేదిప్పుడు. మునుముందు రవితేజ అంటే రొటీన్ కథలతో, రొటీన్ మసాలా సినిమాలతో వస్తాడు అన్న అపవాదు నుంచి బైటపడేందుకు ప్రయత్నిస్తున్నాడు. లేటెస్టుగా రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న బెంగాళ్ టైగర్ సంథింగ్ డిఫరెంట్ అని పోస్టర్ లు చెప్పకనే చెబుతున్నాయి. ఈ పోస్టర్ లలో రవితేజ లుక్ పరంగానూ చాలా డిఫరెన్స్ కనిపిస్తోంది.
రవితేజ స్టయిల్ - బాడీ లాంగ్వేజ్ - డ్రెస్సింగ్ సెన్స్ ప్రతిదీ మార్చేశాడు. లేటెస్ట్ పోస్టర్ లు చూస్తుంటే అతడు ఓ హాలీవుడ్ స్టార్ లా కనిపిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు. బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించి మెస్మరైజ్ చేశాడు. అంతేకాదు తీరైన శరీరాకృతి అతడిలో కనిపించింది. బైసెప్ - ట్రై సెప్ పెంచాడు. ఛాతీ భాగంలో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ న్యూలుక్ లో అస్సలు వయసు ఎంత అన్నది చెప్పడమే కష్టం. ఇదే తీరుగా బెంగాళ్ టైగర్ కథ పరంగా - కథనం పరంగా - కంటెంట్ పరంగా సంథింగ్ న్యూ అనిపిస్తుందనే అనుకుందాం. సంపత్‌నంది కాస్త రొటీనిటీకి దూరంగానే ఈ సినిమాని తెరకెక్కించాడనే సంకేతాలు వెళుతున్నాయి.
రొటీన్ గా ఉండకూడదు. కొత్తగా కనిపించాలి. అయినా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. అప్పుడే దర్శకుడికి ఐడెంటిటీ. ఇకపోతే రవితేజ సన్న లుక్కే కిక్ 2 సినిమాకు పెద్ద మైనస్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి.. ఆ ఫీల్ బెంగాళ్ టైగర్ సినిమాలో రానివ్వకుండా చేస్తే చాలు.. ఆటోమ్యాటిక్ గా హిట్ట పడుద్ది మరి.