తన కెరీర్ తొలినాళ్ళలో మేజర్ బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల కోసం హీరో రవితేజ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వరసగా మూడు భారీ డిజాస్టర్స్ తో తన ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడ్డ శీనుని రవి సరైన టైంలో సినిమా చేసి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇక దీనికి ముందు నుంచే 'అమర్ అక్బర్ అంటోనీ' టైటిల్ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం ఇందులో రవితేజ జై లవకుశ తరహాలో త్రిపాత్రాభినయం చేస్తాడని అందుకే పేరు అలా పెట్టారని అప్పుడే వార్తలు హెడ్ లైన్ లోకి వచ్చాయి. కాని విశ్వసనీయ సమాచారం మేరకు రవితేజ ఇందులో ఎలాంటి ట్రిపుల్ రోల్ చేయటం లేదని సమాచారం. మూడు వేరియేషన్స్ ఉన్న ఒకే పాత్రను చేయటం వల్ల ఈ పేరు ఫిక్స్ చేసారని అంతే తప్ప రవితేజ మొదటి సారి ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు అన్న వార్తలను కొట్టిపారేస్తున్నారు.
నీకోసంతో మొదలైన రవితేజ-శీను వైట్ల బంధం ఆ తర్వాత వెంకీ, దుబాయ్ శీను తో సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అయ్యింది. ఈ ఇద్దరి కాంబోలో ఫెయిల్యూర్ లేదు. అందుకే ఆ ట్రెండ్ అలానే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంతో శీను వైట్ల మంచి ఎంటర్ టైనర్ సబ్జెక్టు తో రవిని ఒప్పించినట్టు టాక్. ఇకపోతే శీను వైట్ల దీనికి కోసం యుఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసాడట. అను ఇమ్మానియేల్ రవితేజతో మొదటిసారి జట్టు కడుతోంది. అమెరికా షూట్ పూర్తి చేసుకున్నాక ఇక్కడ బాలన్స్ పూర్తి చేస్తున్నారు.
అమర్ అక్బర్ అంతోనీ అనే పేరుకి బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, రిషి కపూర్ హీరోలుగా నటించిన ఆ మూవీ అప్పట్లో ట్రెండ్ సెట్టర్. తెలుగులో రామ్ రాబర్ట్ రహీం గా రీమేక్ కూడా చేసారు. ఇప్పుడు ఆ పేరుతో రవితేజ సినిమా చేయటం ఆసక్తి రేపుతోంది. మూడు మతాలను ప్రతిబింబించే మూడు షేడ్స్ ని రవితేజ పాత్రలో చూపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇది కనక హిట్ అయితే శీను వైట్ల స్పీడ్ మళ్ళి అందుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ దీనికి నిర్మాతలు.