మాస్ రాజా అలా ఫిక్సయ్యాడు

Update: 2018-01-11 12:14 GMT
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మొన్న అక్టోబర్లో తన కొత్త సినిమా ‘రాజా ది గ్రేట్’తో పలకరించాడు మాస్ రాజా రవితేజ. ఈ చిత్రం అతడికి మంచి ఫలితమే అందించింది. ఈ సినిమా పని ముగియగానే ‘టచ్ చేసి చూడు’ మీదికి వెళ్లిపోయాడు రవితేజ. ఈ చిత్రాన్ని ఒక దశలో సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అప్పటికి సినిమా రెడీ కావడం కష్టమని.. పైగా సంక్రాంతికి పోటీ ఎక్కువుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారు. తర్వాత జనవరి 26న అంటూ కొత్త డేట్ వినిపించింది. కానీ అది కూడా వదులుకుని.. ఫిబ్రవరి 2కు ఫిక్సయినట్లు సమాచారం.

జనవరి 26 కోసం ఆల్రెడీ ‘భాగమతి’.. ‘మనసుకు నచ్చింది’.. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. వాటితో పోలిస్తే మాస్ రాజా సినిమాకే క్రేజ్ ఉంటుంది కానీ.. ఉన్నట్లుండి ఇది రేసులోకి దిగితే వాటికి ఇబ్బంది. మరోవైపు రిపబ్లిక్ డే వీకెండ్లో హిందీ సినిమాల పోటీ కూడా ఎక్కువగానే ఉంది. ‘పద్మావత్’ భారీ అంచనాల మధ్య జనవరి 25న విడుదల కాబోతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపించే అవకాశముంది. దాంతో పాటు హిందీలోనే ‘ప్యాడ్ మ్యాన్’.. ‘అయ్యారీ’ లాంటి సినిమాలు షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇంత పోటీ మధ్య ఎందుకని సోలోగా ఫిబ్రవరి 2న రావడానికి ఫిక్సయ్యాడు మాస్ రాజా. అదే రోజుకు నాగశౌర్య ‘చలో’ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక ఫిబ్రవరి 9న అయితే నాలుగైదు సినిమాలు రిలీజయ్యే అవకాశముంది. అన్నింట్లోకి క్రేజ్ ఎక్కువన్నది మాత్రం మాస్ రాజా సినిమాకే.
Tags:    

Similar News