గతాన్ని గుర్తు చేసుకోను. జయాపజయాల్ని విశ్లేషించుకోను. ఇప్పుడేం చేస్తున్నాం!! అన్నదే గుర్తుంచుకుంటా. పని మీదే కాన్‌సన్‌ట్రేట్ చేస్తాను.. అని చెబుతున్నాడు రవితేజ. ఈరోజు బెంగాల్ టైగర్ రిలీజ్ సందర్భంగా మాస్ రాజా రవితేజ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. సక్సెస్ ఫెయిల్యూర్ ని ఎలా తీసుకుంటారు? అన్న ప్రశ్నకు రాజా నుంచి వచ్చిన సమాధానం అది.
కిక్2 ఘోర వైఫల్యం వెనక కారణాల్ని అతడు అస్సలు చర్చించనేలేదు. పైగా సురేందర్ రెడ్డితో గొడవ పడ్డారుట కదా? అన్న ప్రశ్నకు.. అదంతా నెగెటివ్ ప్రచారం. వ్యక్తిగతంగా నేను రిలేషన్ కి ఎక్కువ ప్రాధాన్యతనిస్తాను. నేను అనని విషయాల్ని కూడా ప్రచారం చేశారు.. అంటూ మాస్ రాజా వివరణ ఇచ్చారు. సురేందర్ రెడ్డి తో భవిష్యత్ లో సినిమా చేస్తానని రవితేజ అన్నారు.
పబ్లిక్ లైఫ్ కి - ప్రయివేట్ లైఫ్ కి మధ్య తేడా గురించి చెబుతూ.. అసలు నేను పబ్లిక్ లో ప్రతిదానికి ప్రచారం కోరుకోను. ప్రయివేట్ లైఫ్ ని ప్రయివేటుగానే చూస్తాను. దానికి అనవసర ప్రచారం కోరుకోను. అలాగే రిలేషన్స్, సామాజిక సేవలకు సంబంధించిన విషయాల్ని అదే పనిగా ప్రచారం చేసుకోవాలని అనుకోను. కాస్త డీసెన్సీ మెయింటెయిన్ చేయడమే ఇష్టం. పబ్లిక్ లోకి వచ్చి ప్రతిదీ మాట్లాడే నాశిరకం మనిషిని కాను అంటూ చెప్పుకొచ్చాడు.
నిజమే రవితేజ వ్యక్తిగత జీవితం గురించి, ఫ్యామిలీ లైఫ్ గురించి సామాన్య జనాలకు తెలిసింది తక్కువే. తను అన్న మాట అక్షర సత్యం. ఇక అపజయాల్ని గుర్తు చేసుకోవాల్సిన పని రవితేజకి లేదిప్పుడు. ఇన్నేళ్ల కెరీర్ లో అన్నీ అలవాటైపోయాయ్. కాబట్టి ఇప్పుడేం చేస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. బావుంది గురూ..