తన కిక్కు కోసం పక్కోడి ప్రాణాలతో చెలగాటమాడే కుర్రాడిగా కనిపించి అలరించాడు రవితేజ. కిక్ సినిమాలో. ఇప్పుడు `కిక్2` అంటూ వస్తున్నాడంటే డబుల్ బొనాంజా ఖాయం అనేగా అర్థం. ప్రేక్షకులకు రెండింతల కిక్కు పంచేందుకే రవితేజ ఈ సినిమా చేశాడు. 2009లో ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయం సాధించింది `కిక్`. దానికి కొనసాగింపుగా అదే కాంబినేషన్ లో తెరకెక్కిన `కిక్2` ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. కల్యాణ్ రామ్ నిర్మించారు. కంఫర్ట్ కోసం... అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కినట్టు అర్థమవుతోంది. ఇటీవల ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. అందులో కొత్తగా ట్రైలర్ ని విడుదల చేశారు. ఇది తుక్కురేపే కిక్కురోయ్... అంటూ సంకేతాలు ఇచ్చింది చిత్రబృందం. ట్రైలర్ లో రవితేజ సందడి చూసినప్పట్నుంచి ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
ప్రేక్షకులతో మాస్ మహరాజ్ గా పిలిపించుకొంటుంటాడు రవితేజ. మాస్ అంటే ఏంటో, ఆ మాటకి అర్థమేంటో రవితేజ సినిమాలు చూస్తే తెలిసిపోతుంటుంది. నవ్వుకొన్నోళ్లకి నవ్వుకొన్నంత కామెడీ, ఫైట్లు, హృదయాన్ని హత్తుకొనే భావోద్వేగాలు, హీరోయిన్ తో రొమాన్స్... ఇలా ఒకటేమిటి, ప్రేక్షకుల్ని కావల్సినవన్నీ రవితేజ సినిమాలో ఉంటాయి. `కిక్2`ని కూడా అవే కొలతలతో తీసినట్టు అర్థమవుతోంది. బోలెడన్ని మాస్ ఎలిమెంట్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొస్తున్న ప్రతీ సినిమా ప్రేక్షకుల హృదయాల్ని దోచుకొంటోంది. మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో వస్తున్న కిక్2 కూడా విజయం సాధించిందంటే టాలీవుడ్ మరింత కళకళలాడిపోవడం గ్యారెంటీ.