అదేంటోగాని.. పాపం తన తమ్ముడి ఆఖరి చూపుకు వెళ్లడం వెళ్లకపోవడం అనేది హీరో రవితేజ పర్సనల్ విషయం అయినప్పటికీ.. మీడియా మాత్రం ఆయన్ను విడిచిపెట్టట్లేదు. ఆ రోజు భరత్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రాకపోవడంతో.. రవితేజ పెద్ద తప్పుచేశాడంటూ సోషల్ మీడియాలో యుట్యూబ్ లో అలాగే కొన్ని మీడియాల్లో కూడా నెగెటివ్ వార్తలే వచ్చాయి. ఒక జూనియర్ ఆర్టిస్టుతో భరత్ కు తలకొరివి పెట్టించారని కూడా రూమర్లు స్ప్రెడ్ చేయడంపై రవితేజ ఈరోజు ఆవేదన వ్యక్తం చేశారు.
''ఆరోజు కేవలం భరత్ బాడీని అలా చూడలేకే వెళ్లలేదు. కనీసం నేను ఇప్పటివరకు ఆ ఫోటోలు కూడా చూడలేదు. ఎందుకంటే వాడు మా మైండ్ లో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనేదే మా ఉద్దేశ్యం. కాని అక్కడకు మా చిన్నాన్న వచ్చి.. అలాగే మా తమ్ముడు కూడా వచ్చి అంత్యక్రియలు జరిపించారు. దానిని తెలుసుకోకుండా ఎవరో జూ.ఆర్టిస్టుతో చేయించారు అని రాయడం మాత్రం దారుణం. దయచేసి తెలుసుకోకుండా రాసి మమ్మల్ని ఇంకా బాధపెట్టొద్దు ప్లీజ్'' అంటూ ఆవేదన వ్యక్తం చేసిన రవితేజ.. మరుసటి రోజు షూటింగ్ కు వెళ్లడం గురించి కూడా స్పందించారు.
''మీలో చాలామందికి తెలిసే ఉంటుంది.. చాలామంది ఆర్టిస్టుల కాంబినేషన్ పెట్టాలంటే ఎంత కష్టమో. అందుకే ఆ నిర్మాతకు నష్టం రాకూడదని షూటింగ్ కు వెళ్ళాను. వేరే కారణం ఏమీ లేదు. అది కూడా భరత్ చనిపోయిన రోజు కాదు.. ఆ తరువాత రోజున వెళ్ళాను'' అంటూ రవితేజ చెప్పాడు. అయితే మీరు నెట్లో వచ్చిన ఒక సెల్ఫీ ఫోటోలో నవ్వుతూ ఫోజిచ్చారేంటి అంటూ కొందరు మీడియా పర్సన్స్ అడగటంతో.. ''నేను బాధతోనే ఉన్నాను కాని అక్కడ అలా ఫోజివ్వకపోతే ఎలా?'' అంటూ చెప్పిన రవితేజ.. దయచేసి ఇటువంటి ప్రశ్నలను సంధించకండి అంటూ వేడుకున్నాడు. అలాగే తన కుటుంబంపై లేనిపోనివి రాసి బాధపెట్టొద్దని విన్నవిస్తూ సెలవు తీసుకున్నాడు.
Full View