ఆ మధ్య వరస ఫ్లాపులతో సతమతమైన మాస్ మహారాజా రవితేజ రాజాది గ్రేట్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చేశాడు. ఈ సినిమాలో కెరీర్ లో తొలిసారి అంధుడి పాత్రలో కనిపించినా అభిమానులకు కావాల్సిన ఎంటర్ టెయిన్ మెంట్ ఇచ్చి వారిని ఖుషీ చేశాడు. తాజాగా కెరీర్ మొదట్లో తనకు మరిచిపోలేని హిట్లు ఇచ్చి ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న డైరెక్టర్ శ్రీను వైట్లకు తిరిగి లైఫ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ప్రస్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ పూర్తయ్యాక శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా షూట్ స్టార్ట్ చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని శ్రీను వైట్ల అనుకుంటున్నాడు. ఇంతకుముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీసిన బాద్ షా సినిమాలో కాజలే హీరోయిన్ గా నటించింది. శ్రీను వైట్లకు డైరెక్టర్ గా చివరి హిట్ చిత్రం కూడా అదే. దాంతో సెంటిమెంటల్ గానూ కలిసొస్తుందని కాజల్ వైపు మొగ్గు చూపుతున్నాడని అతడి టీంలోని వారు చెబుతున్నారు.
ప్రస్తుత ఇన్నింగ్స్ లో రవితేజ ఆచితూచి అడుగు వేస్తున్నాడు. ముందు స్క్రిప్ట్ బాగా వచ్చిందని సంతృప్తి కలిగాకే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాడని సన్నిహితులు అంటున్నారు. రవితేజ - కాజల్ ఇంతకుముందు వీర.. సారొచ్చారు చిత్రాల్లో జంటగా నటించారు. ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ ను పెద్దగా ఆకట్టుకోలేదు. వీటిలో వీర మాస్ చిత్రం కాగా... సారొచ్చారు క్లాస్ ఎంటర్ టెయినర్.