మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈసినిమా ప్రస్తుత సినిమాల జాబితా కాస్త కన్ఫ్యూ అయ్యేంత గా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే ఖిలాడి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఆ వెంటనే రామా రావు ఆన్ డ్యూటీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయిన విషయం తెల్సిందే.
రామారావు ఆన్ డ్యూటీ తో పాటు ఇదే ఏడాదిలో త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ధమాకా సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు చిరంజీవి తో వాల్తేరు వీరన్న అనే సినిమాలో కూడా రవితేజ నటిస్తున్నాడు. ఇక నిన్నటి వరకు సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణసుర' అనే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. సుదీర్ఘ మైన షెడ్యూల్ ను తాజాగా రావణాసుర పూర్తి చేసుకున్నాడు.
హీరోగా రవితేజ రావణాసుర లో లాయర్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఒక వైపు రావణసుర లెంగ్తీ షెడ్యూల్ పూర్తి చేశారో లేదో అప్పుడే టైగర్ నాగేశ్వరరావు సినిమా మొదటి షెడ్యూల్ ను ప్రారంభించారు. ఇటీవలే చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు లాంచనంగా ప్రారంభం అయిన విషయం అందరికి కూడా తెల్సిందే.
స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ మరియు దొంగ అని ముద్ర పడ్డ టైగర్ నాగేశ్వరరావు గురించిన కథ మరియు ఇంట్రెస్టింగ్ విషయాలతో దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పై రవితేజ చాలా ఆసక్తిగా ఉన్నాడట. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్యాప్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.
రవితేజ మొదటి పాన్ ఇండియా మూవీ అంటూ టైగర్ నాగేశ్వర రావును ప్రచారం చేస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ప్రస్తుతం షూటింగ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ప్రత్యేకంగా వేసిన సెట్టింగ్ లో సినిమా చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతుంది.