ఐఫా ఉత్సవం -2015 వేడుకలు హైదరాబాద్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో ఇంట్రెస్టింగ్ గా మన తెలుగు సినిమాలు అవార్డుల కేటగిరీలో పోటీపడడం ఇంట్రెస్టింగ్. ఐఫా ఉత్తమ నటుడు కేటగిరీకి ఓ ఐదుగురు తెలుగు హీరోలు పోటీపడుతుండడం ఎగ్జయిటింగ్. ఓ ఐదు సినిమాల్ని కమిటీ పరిశీలించి వాటిలో హీరోల పెర్ ఫామెన్స్ పై రివ్యూ చేయబోతున్నారు. బాహుబలి - శ్రీమంతుడు - సన్నాఫ్ సత్యమూర్తి - భలే భలే మగాడివోయ్ - టెంపర్ సినిమాలు ఐఫా బరిలో.. తమ హీరోలైన ప్రభాస్ - మహేష్ - బన్ని - జూ.ఎన్టీఆర్ - నాని లను రేసులో నిలిపాయి.
అయితే వీరిలో ఎవరిని ఉత్తమ నటుడు అవార్డు వరిస్తుంది? అన్నది ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో డిబేట్. బాహుబలి చిత్రంలో ప్రభాస్ నటన అసమానం. ఈ సినిమా రికార్డు స్థాయి విజయం సాధించింది. అలాగే శ్రీమంతుడు సోషల్ మూవీస్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఇందులో ప్రిన్స్ మునుపెన్నడూ కనిపించనంత కొత్తగా కనిపించాడు. అలాగే సన్నాఫ్ సత్యమూర్తిలో బన్ని పెప్పీ క్యారెక్టర్ లో విలువల కోసం పోరాడే కుర్రాడిగా అద్భుతంగా అభినయించాడు. టెంపర్ సినిమాలో దయాగాడి దండయాత్ర అంటూ ఎన్టీఆర్ కూడా ఉతికి ఆరేశాడు. రకరకాల ఎమోషన్లను అవలీలగా పండించేశాడంతే. ఇక భలే భలే మగాడివోయ్ మూవీలో మతిమరుపు కుర్రాడిగా నాని నటనకు అద్భుతమైన ప్రశంసలొచ్చాయి.
మరి బరిలో గెలుపు ఎవరిది.. ఇదే ప్రశ్న మాస్ మహారాజ రవితేజని అడగకుండానే `నాని`కే నా ఓటు అంటూ ముందుకొచ్చాడు. నానీకే నా మద్ధతు.. ఆల్ ది బెస్ట్ టు నాని.. అని తన ఫేస్ బుక్ లో కామెంట్ పెట్టాడు. నిజానికి రవితేజ ఆప్షనే ఐఫా అవార్డుల కమిటీ ఆప్షన్ అవుతుందేమో చూడాలి.