టాలీవుడ్ లో విలక్షణమైన విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవిబాబు. 'అల్లరి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవిబాబు కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ రూట్ లో వెళ్తూ డైరెక్టర్స్ అందరిలో నేను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. 'అమ్మాయిలు అబ్బాయిలు' 'పార్టీ' 'సోగ్గాడు' 'అనసూయ' 'నచ్చావులే' 'అమరావతి' 'మనసారా' 'నువ్విలా' 'లడ్డుబాబు' 'అవును' 'అవును 2' లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలో 'అదుగో' అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక సినిమా చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత రవిబాబు 'ఆవిరి' అనే హార్రర్ థ్రిల్లర్ తో పలకరించిన ప్రేక్షకులు ఆ సినిమాని పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రవిబాబు మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో 'క్రష్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి 'అన్ లాక్ 1.0' పేరుతో ఇటీవలే పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే పోస్టర్ కూడా వైవిధ్యంగా కనిపించింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్స్ కి కొన్ని గైడ్ లైన్స్ తో అనుమతి లభించడంతో చిత్రీకరణ స్టార్ట్ చేయడానికి దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ రవిబాబు 'క్రష్' సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఈ సందర్భంగా రవిబాబు తాను కరోనా నేపథ్యంలో ఎలా షూట్ చేయబోతోంది ఒక చిన్న వీడియో ద్వారా వివరించారు. రవిబాబు మాట్లాడుతూ లాక్ డౌన్ తర్వాత షూటింగ్స్ కి అనుమతి లభించి చిత్రీకరణ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమా మాదేనని.. హీరో హీరోయిన్స్ ఎదురెదురుగా పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హగ్ చేసుకునే సీన్ ఈ రోజు షూట్ చేయబోతున్నాని వెల్లడించారు. ఈ సీన్ లో హీరో హీరోయిన్స్ పరుగెత్తుకొని వచ్చి హగ్ చేసుకోడానికి ట్రై చేయగా వారి మధ్యలో ఒక మిర్రర్ ని ఏర్పాటు చేసి మేనేజ్ చేసాడు రవిబాబు. ఇకపై హగ్ సీన్స్.. కిస్సింగ్ సీన్స్ ఇలానే ఉండబోతున్నాయని చెప్పే ప్రయత్నం చేసాడు డైరెక్టర్. ఈ షూటింగ్ లో సిబ్బంది అందరూ సామాజిక భౌతిక దూరం పాటిస్తూ పీపీఈ షూట్స్ అండ్ మాస్క్స్ ధరించి ఉన్నారు. మొత్తం మీద షూటింగులకు అనుమతి లభించిన తర్వాత ఫస్ట్ చిత్రీకరణ స్టార్ట్ చేసిన ఫస్ట్ సినిమాగా 'క్రష్' నిలిచిపోనుంది. కాగా ఈ సినిమాని ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రవిబాబు నిర్మిస్తున్నాడు. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రవిబాబు 'క్రష్'తో హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.
Full View Full View