గత కొద్దిరోజులుగా భారత్ , చైనా సరిహద్దులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో ..టిక్ టాక్ స్టార్స్ పై ట్రోల్స్ మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలోనే భారత ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ఆస్ట్రేలియా ఓపెనర్, టిక్ టాక్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను ట్రోల్ చేసాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్ ప్రభుత్వం చైనా యాప్ లను నిషేధిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ట్వీట్ ను అశ్విన్ షేర్ చేస్తూ వార్నర్ ను ట్యాగ్ చేశాడు. దీనికి ‘అప్పో అన్వర్?’ అంటూ కన్ను కొడుతున్న ఎమోజీని జత చేశాడు. వార్నర్‌ను ట్రోల్ చేస్తూ చేసిన ఈ ట్వీట్ షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.
ఈ మహమ్మారి ప్రభావంతో క్రికెట్ కార్యకలాపాలను నిలిపివేసిన తరువాత డేవిడ్ వార్నర్ టిక్ టాక్ లో చాలా చురుకుగా ఉన్నారు. తన భార్య మరియు కుమార్తెలతో టాలీవుడ్, బాలీవుడ్ పాటలకు చేసిన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియా లో తెగ వైరల్ అయ్యాయి. అవి బాగా వైరల్ అవుతుండటంతో టిక్ టాక్లో 4.8 ఫాలోవర్స్ ను సంపాదించి వార్నర్ టిక్‌టాక్ స్టార్ కూడా అయ్యాడు. ఐతే , ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో వార్నర్ ఇక తన అత్యధిక ఫాలోవర్స్ ను కోల్పోతాడు. ఎందుకంటే... వార్నర్ భారత పాటలతోనె ప్రసిద్ధి చెందటంతో అతడిని అనుసరించేవారిలో భారతీయులే ఎక్కువ.