ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఇదే సమయంలో ఓటీటీలో పెద్ద ఎత్తున తెలుగు, ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యాయి.
ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు థియేటర్‌ల ద్వారా సినిమాలు వస్తూ ఉన్నాయి. వాటితో పాటు ఓటీటీ ద్వారా కొత్త సినిమాలు, పోస్ట్ థియేటర్ రిలీజ్ సినిమాలు స్ట్రీమింగ్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఓటీటీలో ప్రతి వారం పెద్ద ఎత్తున సినిమాలు, సిరీస్‌లు, షోలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం నాలుగు చిన్న, మీడియం రేంజ్ సినిమాలు థియేటర్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటికి టాక్ ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే ఇదే సమయంలో ఓటీటీలో పెద్ద ఎత్తున తెలుగు, ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యాయి.
సత్యదేవ్ హీరోగా రూపొందిన జీబ్రా సినిమా మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని దక్కించుకోలేదు. దాంతో ఓటీటీ స్ట్రీమింగ్‌లో ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఆహా ఓటీటీ ద్వారా ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. థియేటర్ రిలీజ్‌తో హిట్ కొట్టలేక పోయిన ఈ సినిమా ఓటీటీ ద్వారా హిట్ కొట్టేనేమో చూడాలి. జీబ్రాతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు సైతం తెలుగు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
ఇతర భాషల్లో మాత్రం పెద్ద ఎత్తున సినిమాలు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఫ్రెరీ అనే డచ్ సినిమా, సిక్స్ ట్రిపుల్ ఎయిట్ అనే ఇంగ్లీష్ మూవీ, యూనివర్ క్సో డబీజ్ అనే ఇంగ్లీష్ సిరీస్, ద డ్రాగెన్ ప్రిన్స్ ఇంగ్లీష్ సిరీస్, ద ఫోర్జ్ అనే ఇంగ్లీష్ మూవీ సైతం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రిస్మస్ వీక్ కావడంతో ప్రముఖ హాలీవుడ్ మూవీస్ తో పాటు కొన్ని మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్‌లు సైతం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇంగ్లీష్ సినిమాలు, సిరీస్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వారం కచ్చితంగా పండగే.
అమెజాన్ ద్వారా ఈ వారం ఇప్పటికే ముర అనే మలయాళ మూవీ, మదనోల్సవం అనే మలయాళ మూవీ, స్వైప్ క్రైమ్ అనే హిందీ సిరీస్, బీస్ట్ గేమ్స్ అనే ఇంగ్లీష్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సోనీలివ్ లో క్యూబికల్స్ సీజన్ 4 ను తెలుగులో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంకా సన్‌నెక్ట్స్, జియో సినిమా వంటి ప్రముఖ ఓటీటీ ల్లోనూ హిందీ, ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు పెద్ద మొత్తంలో స్ట్రీమింగ్ మొదలు అయ్యాయి. ఇతర ఓటీటీల్లో గతంలో స్ట్రీమింగ్ అయిన సినిమాలు ఇప్పుడు మరో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం మీద స్ట్రీమింగ్ అవుతున్నాయి.