కొత్త కుర్రాళ్లు తొడ కొట్టెదెప్పుడు?
ఇండస్ట్రీలో కొత్త తరం హీరోలు సక్సెస్ అవుతున్నారు. అవకాశాలు కూడా మునుపటి కంటే మరింత మెరుగ్గానే వస్తున్నాయి.
ఇండస్ట్రీలో కొత్త తరం హీరోలు సక్సెస్ అవుతున్నారు. అవకాశాలు కూడా మునుపటి కంటే మరింత మెరుగ్గానే వస్తున్నాయి. కథా బలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ తమకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటీన సంపాదించుకుంటున్నారు. కార్తికేయ గుమ్మడికొండ, కిరణ్ అబ్బవరం, సుహాస్, నవీన్ పొలిశెట్టి, సిద్దు జొన్నల గడ్డ, విశ్వక్ సేన్ లాంటి వారు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అయిన వారే. వారంతా ఎవరి ట్యాలెంట్ తో వారు ఎదిగారు.
పరిశ్రమలో పడాల్సిన కష్టాలన్ని పడిన తర్వాతే ఫాంలోకి వచ్చినవారు. వీళ్లలో కొంత మందికి కేవలం నటనలో కాదు. రైటింగ్ లోనూ స్కిల్స్ ఉండటంతో మరింత వేగంగా ఎదిగారు. వాళ్లకంటూ ఇప్పుడో స్టాండర్డ్ మార్కెట్ బిల్డ్ అయింది. దర్శక, నిర్మాతలు యంగ్ హీరోల్లో వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే పరిశ్రమలో బ్యాకప్ ఉన్న హీరోలు కూడా సక్సెస్ అవ్వాలి. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఇప్పటికే లాంచ్ అయ్యాడు.
అలాగే రాజీవ్ కనకాల-సుమ తనయుడు రోషన్ కూడా ఎంట్రీ ఇచ్చేసాడు. బుల్లి తెర మెగాస్టార్ ప్రభాకర్ వారసత్వం పుణికి పుచ్చుకుని తనయుడు చంద్రహాస్ కూడా లాంచ్ అయ్యాడు. అలాగే డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. రోషన్ మేకా చైల్డ్ ఆర్లిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి `నిర్మలా కాన్వెంట్`, `పెళ్లి సందడి` చిత్రాల్లో నటించాడు. కానీ అవి అనుకున్నతంగా రీచ్ అవ్వలేదు.
ప్రస్తుతం `వృషభ`, `ఛాంఫియన్` చిత్రాల్లో నటిస్తున్నాడు. రోషన్ కనకాల `బబుల్ గమ్` అనే సినిమాతో హీరో అయ్యాడు. కానీ అది ప్రేక్షకులకు రుచించలేదు. తాజాగా రెండవ చిత్రం `మోగ్లీ`ని నిన్నటి రోజున లాంచ్ చేసాడు. `కలర్ ఫోటో` ఫేం సందీప్ రాజ్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ `రామ్ నగర్ బన్నీ` తో లాంచ్ అయ్యాడు. యాక్టింగ్ లో ఈజ్ , డాన్సులో గ్రేస్ ఉంది. ఇండస్ట్రీకి పనికొస్తాడనే పాజిటివిటీని క్రియేట్ చేసుకున్నాడు.
ఇక ఆకాష్ ఇప్పటికే నటుడిగా ప్రూవ్డ్. ఆ యంగ్ హీరోకి సరైన స్టోరీలు పడితే తిరుగులేని స్టార్ అవుతాడు. ఈ యంగ్ జనరేషన్ హీరోలంతా మార్కెట్ లో పోటీని ఎదుర్కుని సక్సెస్ లతో పాటు, కొత్త అవకాశాలు అందుకోవాలి. సరైన కథల్ని ఎంచుకుని సక్సెస్ తో తమకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. మరీ నవతరం హీరోలు 2025లో ఎలాంటి ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకొస్తారో చూడాలి.