రెడ్ గౌన్ లో పీసీ టూ హాట్ గురూ..!

Update: 2022-10-12 08:30 GMT
ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ జంట వీర‌విహారం గురించి చెప్పాల్సినదేమీ లేదు. వీలున్న ప్ర‌తిసారీ ఈ జంట విహార‌యాత్ర‌లు వెబ్ లో దుమారం రేపుతూనే ఉన్నాయి. రొమాంటిక్ డేట్ లు క్యాండిల్ లైట్ డిన్న‌ర్ లు విదేశీ బీచ్ ల‌లో షికార్లు వ‌గైరా వ‌గైరా నిరంత‌రం అభిమానుల్లో హాట్ టాపిక్. త‌మ కిడ్ మాల్తీ మేరీతో క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్లేందుకు ఈ జంట ఎంతో ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తోంది.

ఈ జంట ఇటీవ‌ల యాత్రలు ముగించి లాస్ ఏంజిల్స్ కు తిరిగి వచ్చారు. పీసీ వ‌రుస‌గా ఈ ట్రిప్ లోంచి ఎగ్జ‌యిటింగ్ ఫోటోల‌ను షేర్ చేస్తోంది. తన ఇన్ స్టాగ్రామ్ లో 'మమ్మీ అండ్ డాడీస్ డే ఔట్' కి సంబంధించి ఇంత‌కుముందు ఒక‌ వీడియోను ఫోటోల‌ను షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. మ‌రో వీడియోలో ప్రియాంక - నిక్ ల రోడ్ ట్రిప్ ని చూడవచ్చు. అలాగే వ‌రుస‌గా ర‌క‌ర‌కాల‌ సోలో ఫోటోల‌ను నిక్ తో స‌న్నిహితంగా ఉన్న ఫోటోల‌ను కూడా పీసీ షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారాయి. వీటిలో పీసీ రెడ్ హాట్ టాప్ ధ‌రించిన ఫోటోలు అభిమానుల్లో గుబులు పెంచుతున్నాయంటే అతిశ‌యోక్తి కాదు. పీసీ పూర్తిగా బ్రాలెస్ లుక్ తో ఆచ్ఛాద‌న లేని విధంగా క‌నిపించి షాకిచ్చింది.

అలాగే నిక్ తో క‌లిసి ఉన్న ఒక అరుదైన ఫోటోని కూడా పంచుకుంది. ఈ ఫోటోల్లో పీసీ పింక్ పెద‌వులు రెడ్ హాట్ డిజైనర్ డ్రెస్ తో ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపించింది. క్యాప్షన్ లో 'మమ్మీ డాడీస్ డే అవుట్' అని రాసింది. అలాగే కోనీ -జెస్సీ అనే ఇద్ద‌రు వండ‌ర్ ఫుల్ వ్య‌క్తుల‌ను ఇటీవ‌ల మిస్స‌య్యామ‌ని కూడా పీసీ త‌న ఇన్ స్టాలో రాసుకుంది. దాని తర్వాత హార్ట్ ఎమోటికాన్ ఉంది. ప్రియాంక - నిక్ జనవరిలో స‌రోగ‌సి ద్వారా తమ కుమార్తె మాల్తీ మేరీని స్వాగతించారు. అప్ప‌టి నుంచి వీరి ఆనందానికి అవ‌ధుల్లేవ్.

ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టా ఫ్యామిలీని తన రెస్టారెంట్ సోనా వంటగదిలోకి తీసుకువెళ్లే సంద‌ర్భాలు ఉన్నాయి. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో త‌న రెస్టారెంట్ కి సంబంధించిన‌ తెరవెనుక వీడియోల‌ను షేర్ చేస్తోంది. శనివారం పీసీ తన చెఫ్ లకు సహాయం చేస్తూ క‌నిపించింది. బుర్రటా బటర్ చికెన్ పిజ్జా- అవకాడో భేల్- అమృతసరి క్రిస్పీ ఫ్రైడ్ ఫిష్ సహా రుచికరమైన వంటకాలను ఆస్వాదించే క్లిప్ ను రిలీజ్ చేసింది. పీసీ భారతీయ వంటకాలపై తనకున్న ప్రేమ గురించి మాట్లాడింది. చెఫ్ ల బృందాన్ని ప్రశంసించింది.ఈ వీడియోలో పీసీ బ్రౌన్ సూట్ లో అందంగా కనిపించింది. వీడియోను షేర్ చేస్తూ ఆమె ఇలా రాసింది, "@సోనాన్ వియార్క్ వంటగది నుండి తెరవెనుక... ఇక్క‌డ‌ నేను చాలా విషయాలను ప్రేమిస్తున్నాను. చాలా రుచికరమైన ఆహారాన్ని అందించినందుకు ధన్యవాదాలు @harinayak .. @harry.nair. నేను త్వరలో తిరిగి వస్తానని మీకు తెలుసు!'' అని వ్యాఖ్య‌ను జోడించింది. ప్రియాంక చోప్రా గతేడాది మార్చిలో తన స్నేహితుడు మనీష్ గోయల్ తో కలిసి న్యూయార్క్ లో సోనా అనే రెస్టారెంట్ ను ప్రారంభించింది.

ప్రియాంక చోప్రా ఇటీవల తన కుమార్తె మాల్తీ మేరీతో కలిసి న్యూయార్క్ ను సందర్శించింది.తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో అరుదైన చిత్రాలను పంచుకోవడం ద్వారా తన అభిమానులను అప్ డేట్ చేసింది. అలాగే ఆమె తన భర్త నిక్ జోనాస్ - సరితా చౌదరి - నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ సహా తన రెస్టారెంట్ సోనాను సందర్శించారు. పీసీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పంచుకుంది ''నాకు ఇష్టమైన కొంద‌రితో NYC నైట్ ' అని ఒక నోట్ రాసింది.

కెరీర్ మ్యాటర్ కి వ‌స్తే ప్రియాంక చోప్రా తదుపరి సిటాడెల్- ఇట్స్ ఆల్ కమింగ్ బ్యాక్ టు మీ .. జీ లే జరా చిత్రాల్లో కనిపించనుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News