బ్లాక్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న అమీ..!

Update: 2023-05-24 19:32 GMT
హాట్ బ్యూటీ అమీ జాక్సన్ తెరపై కనిపించి చాలా కాలమే అవుతుంది. కానీ, ఆమెను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. ఆమె అందానికి అందరూ ఫిదా అయినవారే. ఈ బ్రిటీష్ బ్యూటీ దక్షిణాదిన చాలా సినిమాల్లో మెరిశారు. తెలుగులో  రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ తర్వాత రోబో 2.0, ఐ లాంటి సినిమాల్లో మెరిసింది.

తర్వాత ఆమె లండన్ కి చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటూతో సహజీవనం చేసింది. ఓ బిడ్డకు జన్మని కూడా ఇచ్చింది. తర్వాత అతనితో విడిపోయింది అనుకోండి అది వేరే విషయం. ఈ క్రమంలోనే ఆమె వెండి తెరకు దూరమైంది.

అయితే, చాలా కాలం తర్వాత ఆమె  ఆమె కేన్స్ లో మెరిసింది. నలుపు రంగు దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై సెగలు పుట్టించింది.

ఆ కేన్స్ లో రెడ్ కార్పెట్ పై నడిచినప్పుడు ధరించిన ఫోటోలనే తాజాగా ఆమె తన సోషల్ మీడియాలోనూ షేర్ చేసింది. డ్రెస్ అదే అయినప్పటికీ, ఆమె హాట్ ఫోజులు మాత్రం కుర్రాళ్లకు చెమటలు పట్టించేలా ఉన్నాయి. డ్రెస్ కి మ్యాచింగ్ నలుపు రంగు హై హీల్స్ ధరించింది. మెడలో డైమండ్ జ్యూవెలరీ, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించింది. ఇక టోటల్ లుక్ కేక పుట్టించేలా ఉండటం విశేషం.

అమీ షేర్ చేసిన ఫోటోలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వావ్, హాట్ బ్యూటీ, గార్జియస్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తల్లైన తర్వాత కూడా అమీ అందం చెక్కు చెదరలేదంటూ కామెంట్స్ పెడుతున్నారు. మళ్లీ సినిమాల్లో కి రావాలంటూ ఫ్యాన్స్ కోరుకోవడం విశేషం.

అమీ జాక్సన్ కి ఇన్ స్టాగ్రామ్ లో దాదాపు 13 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు, బికినీ ఫోటోలు కూడా ఆమె షేర్ చేస్తూ ఉంటారు. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తారో లేదో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. చూడాలి మరి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.

Similar News