నిర్మాతగా ధనుష్‌కి పెద్ద కష్టం..!

దాంతో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ సినిమాకు పెద్ద కష్టం వచ్చిందని ఆయన సన్నిహితులు చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Update: 2025-01-08 00:30 GMT

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్ ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూ మరో వైపు దర్శకుడిగా సినిమాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే తన మేనల్లుడు పవిష్‌ని హీరోగా పరిచయం చేస్తూ 'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' అనే సినిమాని నిర్మిస్తున్నాడు. ఆ సినిమాకు ధనుష్ దర్శకత్వం వహించాడు. తమిళ్‌ ప్రేక్షకులకు అజిత్‌ సినిమాలతో బాల నటిగా సుపరిచితురాలైన అనిఖా సురేంద్రన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించింది. జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

'నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్' సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది. కచ్చితంగా సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్‌ సభ్యులకు అజిత్‌ సినిమా పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది. అజిత్‌ హీరోగా రూపొందిన 'విదాముయర్చి' సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నా కొన్ని ఆర్ధిక పరమైన కారణాల వల్ల, లీగల్‌ ఇష్యూస్‌ కారణంగా వాయిదా పడింది. సినిమా ఇప్పటికే విడుదలకు సిద్ధం అయ్యింది. కనుక లీగల్‌ ఇష్యూస్‌ అన్నీంటిని క్లీయర్‌ చేసుకుని ఫిబ్రవరికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అజిత్ విదాముయర్చి సినిమాను ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యుల్లో కొందరు చెప్పుకొచ్చారు. దాంతో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ సినిమాకు పెద్ద కష్టం వచ్చిందని ఆయన సన్నిహితులు చిత్ర యూనిట్‌ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా ఉన్న కారణంగానే ధనుష్ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేరా సినిమాను వాయిదా వేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే విదాముయర్చి సినిమా రానుండటంతో మొత్తం కథ అడ్డం తిరిగే అవకాశాలు ఉన్నాయి.

ధనుష్ సినిమా అజిత్‌ సినిమాకు పోటీగా వస్తే పర్వాలేదు కానీ, ఈ సినిమా ఒక కొత్త హీరో సినిమా.. పైగా పవిష్‌కి ఇదే మొదటి సినిమా. కనుక అజిత్‌ సినిమా కనుక ఫిబ్రవరి మొదటి వారంలో వస్తే నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్ సినిమాను కనీసం రెండు వారాల పాటు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మార్చిలో కొన్ని పెద్ద సినిమాలు లైన్‌లో ఉన్నాయి. కనుక ఈ సినిమాకు ఫిబ్రవరి 7 కాకుండా మరేదైనా మంచి డేట్‌ లభించేనా లేదంటే ఏదో ఒకటి అన్నట్లుగా విడుదల చేస్తారా అనేది చూడాలి. ధనుష్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పవిష్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు.

Tags:    

Similar News