బాలీవుడ్ లో రిలీజ్ డేట్ విషయంలో చాలా పక్కగా ఉంటారు. ఇంకా సినిమా మొదలవకముందే రిలీజ్ డేట్ ఇచ్చేస్తారు. ఆరు నూరైనా ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేసి తీరాల్సిందే. ఐతే రిలీజ్ డేట్ కి ఆర్నెల్ల ముందు సినిమా మొదలుపెట్టి.. హడావుడి పడరు అక్కడి జనాలు. చాలా టైం తీసుకుంటారు. కానీ మన దగ్గర అలా కాదు. ఆర్నెల్లలో సినిమా పూర్తి చేసి రిలీజ్ చేసేస్తామని ఘనంగా ప్రకటిస్తారు. తీరా విడుదల దగ్గర పడేసరికి అంతా కంగాళీ అయిపోతుంది. డేటు మార్చేస్తారు. ఈ ఏడాది ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ముందు ప్రకటించిన రిలీజ్ డేట్ కు రాలేదు. గోపాల గోపాల దగ్గర్నుంచి తాజాగా రిలీజైన కిక్-2 వరకు ఇదే పరిస్థితి. కిక్-2 విషయంలో రవితేజ ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు. అయినా రిలీజ్ విషయంలో అతను చేసేదేమీ లేదన్నది వాస్తవమే.
రవితేజ ప్రమేయం ఉందా లేదా అన్నది పక్కన బెట్టేస్తే మాస్ రాజా తర్వాతి సినిమా కూడా అనుకున్న డేటుకు రిలీజ్ కావడం లేదు. రవితేజ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాధామోహన్ నిర్మాత. తమన్నా కథానాయిక. ఈ సినిమాను సెప్టెంబరు 18న రిలీజ్ చేస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఆ తర్వాత ప్రెస్ నోట్ లో కూడా ఇదే డేటు ఖాయమని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా అక్టోబరులో కూడా డౌటే అన్నట్లుంది. చిత్రీకరణ ఇంకా మిగిలే ఉండటంతో వాయిదా తప్పట్లేదు. కొంత టాకీ పార్ట్ తో పాటు, పాటల చిత్రీకరణ మిగిలి ఉందట. కిక్-2 ఫలితం చూశాక ఈ సినిమా విషయంలో రవితేజ మరింత జాగ్రత్త పడుతున్నాడట.