మాస్ మహారాజా నుండి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాలేదు. ప్రతీ ఏడాది కనీసం రెండు సినిమాలతో అయినా సందడి చేసే రవితేజ స్మాల్ బ్రేక్ తీసుకొని డబుల్ ఎంటర్టైన్ మెంట్ ప్లాన్ చేస్తున్నాడు. అవును ఈ ఏడాది వదిలేసిన రవితేజ వచ్చే ఏడాది రెండు సినిమాలతో తన అభిమానులతో పాటు సినీ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
రవితేజ లేటెస్ట్ సినిమా 'డిస్కో రాజా' జనవరి 24 న థియేటర్స్ లోకి రానుండగా సమ్మర్ లో 'క్రాక్' వచ్చే అవకాశం ఉంది. ఒక వేళ సమ్మర్ మిస్ అయినా దసరాకి సినిమా కన్ఫర్మ్.
ఇక 'డిస్కో రాజా'లో రవి తేజ కోమా కామెడీ సినిమాకు మెయిన్ ఎట్రాక్షన్ అని అంటున్నారు. కొన్నేళ్ళ పాటు కోమాలో ఉండి బయటికొచ్చిన రవితేజ తనదైన స్టైల్ లో నవ్వులు పూయిస్తాడని దాంతో పాటు వి ఐ ఆనంద్ స్టైలిష్ మేకింగ్ సినిమాకు ప్లస్ అనే టాక్ వినబడుతుంది. మరి మాస్ మహారాజా ఈ డబుల్ ఎంటర్టైన్ మెంట్ తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టి మళ్ళీ ఫాం లోకి వస్తాడా చూడాలి.