సెన్సార్‌ రిపోర్ట్: రెండో కిక్కుకి యు/ఎ

Update: 2015-08-17 14:17 GMT
కిక్కో కిక్కు అంటూ రవితేజ 'కిక్‌' సినిమాలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ హంగామాలో కామెడీ ఉంది. రొమాన్స్‌ ఉంది. యాక్షన్‌ ఉంది. మసాలా సాంగ్స్‌ ఉన్నాయి. ఇప్పుడూ అవే ఉంటాయి. కాకపోతే డబుల్‌ కిక్‌ ఇస్తాయని దర్శకుడు సురేందర్‌ రెడ్డి కిక్‌ 2 ప్రారంభం నుంచి చెబుతూనే ఉన్నారు. అనుకున్నట్టే సినిమాని పూర్తి చేసి సెన్సార్‌ ముంగిటకు తెచ్చారు.

అయితే ఈ చిత్రంలో వయొలెన్స్‌, రక్తపాతం ఎక్కువగా ఉండడం వల్ల 'ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారని ప్రచారమైంది. ఈ మధ్యలోనే ఏం జరిగిందో కొన్ని కట్స్‌ చెప్పి 'యు/ఎ' సర్టిఫికెట్‌ ఇచ్చారని ఈరోజు రిపోర్ట్‌ వచ్చింది. రివైజింగ్‌ కమెటీకి వెళ్ళడం వలన ఇప్పుడు రేటింగును ఏ నుండి యు/ఎ కి మార్చారని టాక్‌. ఈ సినిమాలో యాక్షన్‌ భారీగా ఉంది. మాస్‌రాజాకి రేసుగుర్రం విలన్‌ రవికిషన్‌ కి మధ్య అదిరిపోయే యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. జిల్‌ ఫేం కబీర్‌ దుల్హాన్‌ తోనూ ఫైట్‌ సీన్స్‌ ఉన్నాయి. వీటితో పాటే రకూల్‌ ప్రీత్‌ సింగ్‌ తో రొమాన్స్‌ ఇరగదీశాడు హీరో.

కిక్కిచ్చే సన్నివేశాలకు కొదువే లేదు అంటూ రిపోర్ట్‌ వచ్చేసింది. రెండున్నర గంటల పాటు అదరగొట్టే విజువల్‌ ట్రీట్‌ అవుతుందని చెబుతున్నారు. ఈనెల 21న ఈ సినిమా థియేటర్ల లోకి వస్తోంది. డబుల్‌ కిక్కు ఉందో లేదో చెప్పడానికి మూడు రోజులు వెయిట్‌ చేస్తే చాలింకా.
Tags:    

Similar News