'సినిమా చూపిస్తా మావ' డైరెక్టర్ తో మాస్ రాజా కొత్త సినిమా!

Update: 2020-04-17 13:00 GMT
మాస్ మహారాజా రవితేజ - గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న హ్యాట్రిక్ సినిమా 'క్రాక్'. హీరోగా రవితేజ 66వ సినిమా ఇది. రవితేజ పవర్‌ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని - వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నారు. రవితేజ పోలీస్ గెటప్‌ లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. మే నెలలో ప్రపంచ వ్యాప్తంగా 'క్రాక్' చిత్రాన్ని భారీగా విడుదల చేసే ప్లాన్ ఉన్నారు. ప్రస్తుతం వరుస ప్లాప్ లలో ఉన్న రవితేజ నటించిన లాస్ట్ నాలుగు సినిమాలు దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. టచ్ చేసి చూడు - నేల టికెట్ - అమర్ అక్బర్ ఆంథోనీ - డిస్కో రాజా సినిమాలు ఒకటికి మించి మరొకటి ప్లాపులుగా మిగిలాయి.

కానీ సినిమాల ఎంపికలో ఎక్కడా జోరు తగ్గించడం లేదు. రమేష్ వర్మ డైరెక్షన్ లో కూడా ఒక సినిమాను ఓకే చేసాడు. క్రాక్ సినిమా షూటింగ్ పూర్తవ్వగానే రమేష్ వర్మతో సినిమాను మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. తదుపరి సినిమాను నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా 1980 కాలం నాటి నేపథ్యంలో కొనసాగుతుందనేది తాజా సమాచారం. కామెడీ ఎంటర్టైనర్ అయినప్పటికీ, బలమైన ఎమోషన్స్ వుంటాయని అంటున్నారు. ఇంతకుముందు త్రినాథరావు 'సినిమా చూపిస్తమావ' 'నేను లోకల్' సినిమాలను హిట్ చేశాడు. అదే తరహాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రవితేజ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఇటీవలే లైట్ హార్టెడ్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనెర్లు తెరకెక్కించడంలో త్రినాధరావు నక్కిన సిద్ధహస్తుడు అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో తనతో సినిమా అంటే తనకు కూడా కొత్తగా ఉంటుందని భావించాడు రవితేజ. అందుకే తను చెప్పిన కథను ఓకే చేసాడు. ఇక తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నాను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. రవితేజ - తమన్నా కలిసి బెంగాల్ టైగర్ సినిమాలో నటించారు. అందులో వారి జోడికి మంచి మార్కులే పడ్డాయి. ఒక పాటలో తమన్నా గ్లామర్ విందు కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయింది. అధికారికంగా ప్రకటించలేదు కానీ తమన్నాతో సంప్రదింపులు జరుగుతున్నాయట. చూడాలి మరి ఎలాంటి న్యూస్ వినిపిస్తుందో..
Tags:    

Similar News